Sandeep vanga : ఇండియా కాకుండా హాలీవుడ్‌కు పోతా..!

సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga).. ఇండియ‌న్ ఫిలిం ఇండ‌స్ట్రీ (Indian Film Industry)లో ఈ మ‌ధ్య కాలంలో ఓ రేంజ్‌లో మార్మోగిపోతున్న పేరు.. అర్జున్ రెడ్డి సినిమాతో దర్శకుడిగా అడుగుపెట్టిన సందీప్ రెడ్డి వంగా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అర్జున్ రెడ్డి (Arjun Reddy) మూవీతో ఇంట గెలిచిన ఈయన.. బాలీవుడ్‌ (Bollywood) లో అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్‌తో పాటు తాజాగా యానిమల్ మూవీలతో రచ్చ లేపాడు.

సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga).. ఇండియ‌న్ ఫిలిం ఇండ‌స్ట్రీ (Indian Film Industry)లో ఈ మ‌ధ్య కాలంలో ఓ రేంజ్‌లో మార్మోగిపోతున్న పేరు.. అర్జున్ రెడ్డి సినిమాతో దర్శకుడిగా అడుగుపెట్టిన సందీప్ రెడ్డి వంగా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అర్జున్ రెడ్డి (Arjun Reddy) మూవీతో ఇంట గెలిచిన ఈయన.. బాలీవుడ్‌ (Bollywood) లో అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్‌తో పాటు తాజాగా యానిమల్ మూవీలతో రచ్చ లేపాడు. యానిమ‌ల్ మూవీ లాస్ట్ ఇయర్ డిసెంబర్ 1న భారీగా విడుదలై దుమ్ము రేపే వసూళ్లనే రాబట్టింది. అంతేకాదు ఈ మూవీని రణబీర్ మార్క్ యాక్షన్ కమ్ లవ్ సెంటిమెంట్‌తో తెరకెక్కించాడు. ఈ మూవీపై కొంత నెగ‌టివిటీ కూడా వచ్చినప్పటికీ.. మాస్ ప్రేక్షక లోకం మాత్రం ఈ మూవీకి సలాం కొట్టింది.. రణబీర్ కపూర్ హీరోయిజంతో పాటు బాబీ దేవోల్ విలనిజం.. అనిల్ కపూర్ (Anil Kapoor) యాక్టింగ్.. రష్మిక ఎమోషనల్ యాక్టింగ్.. తృప్తి దిమ్రీ హాట్ సీన్స్ వెరసి ఈ సినిమా గతేడాది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అయితే.. తన సినిమాలపై వస్తున్న నెగిటివిటీపై రీసెంట్‌గా సందీప్ వంగా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

అయితే.. అర్జున్ రెడ్డి సినిమాపై అప్పట్లో రేగిన దుమారం అంతా ఇంతా కాదు.. ఆ మూవీలో కొన్ని సీన్స్, డైలాగ్స్ పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు చేస్తే యూత్ పాడైపోతారంటూ చాలా మంది గగ్గోలు పెట్టారు. నిజానికి ఈ కాంట్రవర్సీస్ కూడా అర్జున్ రెడ్డి భారీ హిట్‌కు ప్లస్ అయ్యాయి. ఆ సమయంలోనే సందీప్ రెడ్డి ఆసక్తికర వాఖ్యలు చేశారు. తెలుగులో తన సినిమాలు అడ్డుకుంటే బాలీవుడ్ కి వెళ్లి మూవీస్ చేసుకుంటా అని అన్నారు. చెప్పినట్లుగానే బాలీవుడ్‌ బాక్సాఫీస్ ను కూడా బద్దలు కొట్టారు. అయితే.. అక్కడ కూడా ఇలాంటి నెగటివిటీయే సందీప్ వంగాకు ఎదురైంది.. ఈ సినిమాలో హింసని ఎక్కువగా చూపించాడని.. అలాగే హీరోయిన్ క్యారెక్టర్‌ను తక్కువ చేసి చూపించాడంటూ విమర్శలు వచ్చాయి.

తనపై వస్తున్న ఈ కామెంట్స్‌పై సందీప్ రెడ్డి వంగా ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తన సినిమాపై విమర్శకులు కామెంట్స్ చేస్తే అస్సలు పట్టించుకోను అని తేల్చేసాడు. ఇండియాలో కూడా నన్ను సినిమాలు చేయనీయకపోతే హాలీవుడ్ కి వెళ్లి మూవీస్ చేస్తా అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. తనకు భాషా పరిమితులు లేవని… ఏ లాంగ్వేజ్ లో అయిన చేస్తా అంటూ కామెంట్స్ చేశాడు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం సందీప్ వంగా స్పిరిట్ మూవీ కూడా పాన్ వరల్డ్ మూవీగానే తెరకెక్కిస్తున్నారు. ఇంగ్లీష్ లో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ పాన్ వరల్డ్ రేంజ్ లో సక్సెస్ కొడితే సందీప్ రెడ్డి నెక్స్ట్ హాలీవుడ్ సినిమా చేసినా ఆశ్చర్యం లేదంటున్నారు ఫ్యాన్స్.. మరి సందీప్ వంగా కాన్ఫిడెన్స్ లెవల్ తనను ఏ రేంజ్‌కు తీసుకువెళ్తుందో చూడాల్సిందే..