Thalapathy Vijay: ప్రపంచం కొత్త కొత్త టెక్నాలజీతో దూసుకుపోతోంది.. ఇక సినిమా రంగంలో సాంకేతిక కొత్తపుంతలు తొక్కుతోంది.. టెక్నాలజీతో దర్శకులు అద్భుతాలు సృష్టిస్తున్నారు.. ఏఐ టెక్నాలజీపై సైతం నేటి దర్శకులు ఫుల్ కాన్‌సెన్‌ట్రేట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న గోట్ మూవీలో.. ఇటీవలే మృతి చెందిన సీనియర్ హీరో విజయకాంత్ ని.. క్యామియో రూపంలో పునఃసృష్టించబోతున్నారు అనే వార్త ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
Jr NTR: రిస్క్ చేస్తున్నాడా.. బాలీవుడ్ స్టార్స్ పాలిట విలన్‌గా ఎన్టీఆర్
ఈ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీలో విజయ్ కాంత్ అతిథి పాత్రలో కనిపించబోతున్నాడని, దీనికోసం ఏఐ టెక్నాలజీని మేకర్స్ వాడనున్నట్లు ఇండస్ట్రీలో స్ట్రాంగ్ బజ్ క్రియేటైంది. విజయ్‌కాంత్ ను ఇలా అతిథిపాత్రలో చూపించాలని అనుకుంటున్నట్లు అతని కుటుంబంతో చెప్పగా వాళ్లు కూడా అందుకు అనుమతించినట్లు టాక్ వినిపిస్తోంది. నిజానికి.. చనిపోయిన సీనియర్ నటులను కూడా సినిమాల్లో భాగం చేయడం ఇప్పుడు కొత్తేమీ కాదు. గతంలో కలిసుందాం రా, యమదొంగ పాటల్లో స్వర్గీయ ఎన్టీఆర్ స్టెప్పులను గ్రాఫిక్స్ తో వాడుకున్నారు. కానీ వాటిలో ఒరిజినల్ ఫుటేజ్ నే చూపించారు.
అయితే.. ఇప్పుడు విజయ్‌కాంత్ పాత్ర మాత్రం అలా కాదు.. నిజంగానే విజయ్ కాంత్ నటించారా అనేంత సహజంగా క్యారెక్టర్ ఉంటుందట.. గోట్ లో విజయ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు., ఒక పాత్ర 90 దశకంలో ఉంటుంది. దానికి సంబంధించిన ఎపిసోడ్లలోనే కెప్టెన్ ఎంట్రీ ఉంటుందట., ఈ మధ్యే మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కూడా లాల్ సలామ్ సినిమా కోసం ఇద్దరు దివంగత సింగర్లతో పాడించాడు.. ఇప్పుడు విజయ్‌కాంత్‌ను కూడా ఏఐ టెక్నాలజీతో రియలిస్ట్‌గా చూపించబోతున్నారన్నది చాలా ఆసక్తికరగా మారింది.