టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు ఓ రేంజ్ లో హైప్ ఉంటుంది. ఆ సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా హైప్ మాత్రం పీక్స్ లో ఉంటుంది. పవన్ ఓ ప్రాజెక్ట్ కు సైన్ చేస్తే ఫ్యాన్స్ కు పండుగ వచ్చినట్టే. సినిమాకు లాభాలు రాకపోయినా నష్టం మాత్రం ఉండదు అనే నమ్మకంలో నిర్మాతలు ఉంటారు. అందుకే పవన్ సినిమాలు ఆలస్యం అయినా నిర్మాతల్లో పెద్దగా ఆందోళన ఉండదు అనే టాక్ ఉంటుంది. ఇప్పుడు పవన్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఈ మూడు సినిమాలకు సైన్ చేసి మూడేళ్ళు అవుతోంది.
కాని ఒక్క సినిమా కూడా ఇప్పటి వరకు కనీసం షూట్ కూడా కంప్లీట్ చేసుకోలేదు. ఈ సినిమాల్లో హరిహర వీరమల్లు సినిమాపై ఫ్యాన్స్ కు చాలా ఆశలు ఉన్నాయి. ఈ సినిమాలో పవన్ కాస్త డిఫరెంట్ గా కనపడుతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ కూడా సినిమాపై హైప్ ను ఓ రేంజ్ లో పెంచాయి అనే చెప్పాలి. ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ తో పాటుగా మెగా ఫ్యాన్స్ కూడా ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. అయితే షూట్ విషయంలో పవన్ కాస్త ఆలస్యం చేయడంతో మేకర్స్ కాస్త డిఫరెంట్ గా ఆలోచించారు.
పవన్ తో విజయవాడలో ఓ స్టూడియోలో డబ్బింగ్ చెప్పించేస్తున్నారు. మరో వైపు హైదరాబాద్ లో షూట్ కూడా ఫినిష్ చేస్తున్నారు డైరెక్టర్ జ్యోతి కృష్ణ. పవన్ డబ్బింగ్ ఆల్మోస్ట్ ఫినిష్ అయింది. పవన్ రోల్ కు సంబంధించి ఇంకో వారం రోజులు మాత్రమే షూట్ ఉంటుంది. ఈ వారం రోజులు కూడా రెగ్యులర్ షూట్ కాదని టాక్. హైదరాబాద్ లో పవన్ లేని సీన్స్ ను షూట్ ఫినిష్ చేసి… త్వరలోనే ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయనున్నారు. న్యూ ఇయర్ కు కచ్చితంగా కనీసం ఒక్క పాట అయినా రిలీజ్ చేయాలని పట్టుదలగా ఉన్నారు మేకర్స్.
దానికి పవన్ కూడా ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్. ఈ సినిమాలో పవన్ రోల్ విషయంలో కాస్త మార్పులు కూడా జరిగాయి అని టాక్. ముందు క్రిష్ షూట్ చేసిన సీన్స్ ను జ్యోతి కృష్ణ మార్చారు అని సమాచారం. ఆ సీన్స్ కు సంబంధించి పవన్ కూడా కాస్త అసహనం వ్యక్తం చేసారని… అందుకే మార్చాలని నిర్ణయం తీసుకున్నట్టు టాక్. ఈ సినిమాను మొత్తం ఆరు భాషల్లో రిలీజ్ చేయనున్నారు.