1000 కోట్ల అత్యాశ… బాస్ వార్నింగ్ తో గెలకటం వెనక…

కాన్ స్టార్ అల్లు అర్జున్ తో సుకుమార్ తీసిన పుష్ప2 లో డైలాగ్స్ మిస్ ఫైర్ అయ్యాయా? అసలే మెగా ఫ్యామిలీతో అల్లు ఫ్యామిలీ దూరం పెరిగింది. ఏపీ ఎలక్షన్స్ టైంలో బన్నీ ప్రచారం పెద్ద వివాదంగా మారింది. ఇలాంటి టైంలో పుష్ప2 లో ఇండస్ట్రీకే బాస్ లాంటి వ్యక్తి మీద బన్నీ డైలాగ్స్ విసిరాడా? వాడికి, వాడి కొడుక్కి కూడా తానే బాస్ అంటూ పేల్చిన డైలాగ్, ఇంకెక్కడో పేలిందా?

  • Written By:
  • Publish Date - December 6, 2024 / 08:01 PM IST

కాన్ స్టార్ అల్లు అర్జున్ తో సుకుమార్ తీసిన పుష్ప2 లో డైలాగ్స్ మిస్ ఫైర్ అయ్యాయా? అసలే మెగా ఫ్యామిలీతో అల్లు ఫ్యామిలీ దూరం పెరిగింది. ఏపీ ఎలక్షన్స్ టైంలో బన్నీ ప్రచారం పెద్ద వివాదంగా మారింది. ఇలాంటి టైంలో పుష్ప2 లో ఇండస్ట్రీకే బాస్ లాంటి వ్యక్తి మీద బన్నీ డైలాగ్స్ విసిరాడా? వాడికి, వాడి కొడుక్కి కూడా తానే బాస్ అంటూ పేల్చిన డైలాగ్, ఇంకెక్కడో పేలిందా? మెగా బ్యాచ్ ని చాన్నాల్లుగా పరోక్షంగా కెలుకుతున్న బన్నీ అంటూ ఆల్రెడీ సోషల్ మీడియాలో కామెంట్ల దాడి జరుగుతోంది. ఇంత జరిగినా, పుష్ప 2 తాలూకు 1000కోట్ల అథ్యాశే కొంపముంచేలా ఉందంటే, మెగా హీరోల మీద ఇండైరెక్ట్ గా వేసిన సెటైరికల్ డైలాగ్స్ వివాదంగా మారాయి… చిలికి చిలికి గాలి వాన కాస్త మెగా తూఫాన్ గా మారేలా ఉంది.

మెగా వార్ కి బన్నీ కావాలనే కాలు దువ్వుతున్నాడా? పుష్పరాజ్ పేల్చిన డైలాగ్స్ అన్నీ మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసినవేనా? కేవలం ఒక పార్టి ఇలా ప్రమోట్ చేసి, మెగా హీరోల మద్యే చిచ్చు పెడుతోందా? ఇలాంటి డౌట్లన్నీ రావటానికి కారణం పుష్పరాజ్ బాస్ మీద వేసిన సెటైర్లే కారణం

బేసిగ్గా ఇండస్ట్రీలో ప్రస్థుతం బిగ్ బాస్ అంటే పరోక్షంగా మెగాస్టారే.. కాని పుష్ప2లో ఎవడ్రా బాసు, ఎవడికిరా బాసు, ఆ బాసుకే నేను బాసుని, బాసుకే కాదు బాసుకొడుక్కి కూడా నేనే బాసుననే డైలాగ్ లో ఫైర్ కాదు మిస్ ఫైర్ అయ్యిందంటున్నారు

ఎందుకంటే మెగా హీరోలకి దూరం దూరంగా ఉంటూ, సొంత ఐడెంటీటీకోసం ట్రై చేస్తున్న బన్నీకి, పుష్పతో పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది. పుష్ప2 తో ఇక తనకి తిరుగులేదనే స్థాయిలో గాల్లోతేలిపోయాడు. అంతవరకు బానే ఉంది. కాని ట్రైలర్ వచ్చిన కొత్తలో పుష్పరాజ్ మనీకి, పవర్ కి భయపడనని, పవన్ కి పరోక్షంగా సెటైర్ విసిరాడన్నారు

అలా అయితే అన్ స్టాపబుల్ షోలో పవన్ ని పవర్ ఫుల్ పొలిటీషియన్ అని ఎందుకంటాడు? పవన్ కి తన మీద బ్యాడ్ ఒపీనియన్ ఉంటే ఏపీలో స్పెషల్ షోలు, టిక్కెట్ ప్రైజ్ కి అంతగా ఎలా పర్మీషన్ వస్తుంది లాంటి డౌట్లు వస్తున్నాయి

అవి అటుంచితే, బాసులకి బాసుని, బాసు కొడుక్కి కూడా తానే బాసుని అన్న మాట, మాత్రం మెగా ఫ్యాన్స్ కి ఎక్కడో గుచ్చుకుందట. మెగాఫ్యాన్స్ నొచ్చుకోవటమే కాదు, సోసల్ మీడియాలో ట్రోలింగ్స్, కౌంటర్స్, ఎన్ కౌంటర్స్ దుమ్ముదులుపుతున్నాయి. ఇది చిలికి చిలికి గాలివాన కాదు తుఫాన్ గా మారి చిరవకి సునామీ క్రియేట్ చేసేలా ఉంది.