ప్రభాస్ బేసిగ్గా మ్రుధు స్వభావి. నో చెప్పడం తెలియదు. నొప్పించటం రాదు.. కాని బాక్సాఫీస్ లో మాత్రం వెయ్యికోట్లు 1800 కోట్లంటూ సినీ సునామీలు క్రియేట్ చేయటంలో దిట్ట… చాలా సార్లు ప్రూవ్ అయ్యింది. ఇంకా అవుతూనే ఉంటుంది. రాజా సాబ్ సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ లో రాబోతోంది. అంటే ఇంకా 7 నెల్ల టైం ఉంది… ఇలాంటి టైంలో తన బర్త్ డే స్పెషల్ గా టీజరో, గ్లింప్సో రిలీజ్ చేసేందుకు ఫిల్మ్ టీం రెడీ అయ్యింది
కాని సడన్ గా సీన్ లోకి దర్శకుడు మారుతి వచ్చి నో అన్నాడట. రెబల్ స్టారే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక, నిర్మాతతో పాటు టోటల్ టీం ఈ గ్లింప్స్ రిలీజ్ కి రెడీ అన్నాక, ఇప్పుడు బర్త్ డే ట్రీట్ కి మారుతి మాత్రం నో అంటున్నాడు..
కారణం ఫౌజీ మూవీనే అంటున్నారు. దసరా స్పెషల్ గా హను రాఘవపూడీ ఇప్పుడు ప్రభాస్ తో చేసిన ఫోటో షూట్ తాలూకు వీడియోతో చిన్న పాటి ప్రోమో వదలబోతున్నాడు. అయితే దానికి ప్రభాస్ బర్త్ డే కి మధ్య కనీసం 10 రోజుల గ్యాప్ ఉంటోంది. అలాంటప్పుడు దసరాకు ఫౌజీ ట్రీట్, ప్రభాస్ బర్త్ డేకి రాజా సాబ్ టీజర్ ని రిలీజ్ చేయొచ్చు..
కాని మారుతి నో చెప్పడానికి రీజన్, రాజా సాబ్ తాలూకు బేసిక్ గ్లింప్స్ ఆల్రెడీ వదలారు. సో ఇప్పడప్పుడే మరో ట్రీట్ ఎందుకనేది తన వాదనని తెలుస్తోంది. రాజా సాబ్ రిలీజ్ కి ఇంకా 7 నెలల టైం ఉంది. సో ఇప్పుడే టీజర్ వదలటం సరైన నిర్ణయం కాదనేది మారుతి అభిప్రాయమట. మరి ప్రభాస్ ఇంకా సెట్లో అడుగుపెట్టని ఫౌజీ ప్రోమో వదులుతున్నారు కదా అంటే, అది కేవలం ఫోటో షూట్ వీడియోనే కాబట్టి సినిమా కంటెంట్ రివీల్ అయ్యే సీన్ లేదు.. అందుకే ఫ్యాన్స్ కోసం రాజా సాబ్ టీజర్ ని ఇప్పుుడ వదిలి, ఎప్పుడో ఏడునెలలకు సినిమాను విడుదల చేస్తే, ఈ లోపు ఆ ఎగ్జైట్ మెంట్ కామన్ ఆడియన్స్ లో తగ్గే అవకాశం ఉంది. ప్రభాస్ క్రేజ్, ఇమేజ్ కి తనేం చేసినాజనం ఎగ్జైట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాని ఒక నిర్ణయం వల్ల పావలా నష్టవచ్చినా అది నష్టమే.. అందుకే అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డేకి రాజా సాబ్ నుంచి ట్రీట్ వద్దనే మారుతి మాటే నిజమయ్యేలా ఉందట.