GUNTUR KAARAM: గుంటూరు కారం మూవీ.. ఆ మలయాళ సినిమాకు ఫ్రీమేకా..?

త్రివిక్రమ్ ఎప్పుడు ఏమూవీ తీసినా దానికి కాపీ వివాదం రాకుండా ఉండదు. అల వైకుంఠపురంలో వచ్చినప్పుడు ఇది సీనియర్ ఎన్టీఆర్ హిట్ మూవీ ఇంటి గుట్టు కాపీ అన్నారు. అన్నట్టుగానే పిల్లల్ని మార్చే కాన్సెప్ట్ కనిపించటంతో త్రివిక్రమ్ కథని లిఫ్ట్ చేశాడని తేల్చేశారు.

  • Written By:
  • Updated On - January 9, 2024 / 07:03 PM IST

GUNTUR KAARAM: గుంటూరు కారం ట్రైలర్ వచ్చిన వెంటనే ఇది 2005లో మమ్ముటి చేసిన మలయాళ మూవీ రాజ మాణిక్యం కాపీ అనేశారు. ట్రైలర్‌లో హీరోని చిన్నప్పుడే వదిలేసే తల్లి.. తర్వాత తను తిరిగి తల్లికోసం రావటం, పిన తండ్రి తో వైరం.. ఇలాంటి కథతో వస్తోందా అనేలా ట్రైలర్ తో కొంత కథ రివీల్ అయ్యింది. దీంతోనే ఇది మలయాళం రాజమాణిక్యం కాపీ అనేశారు. త్రివిక్రమ్ ఎప్పుడు ఏమూవీ తీసినా దానికి కాపీ వివాదం రాకుండా ఉండదు.

Kalki 2898 AD: చిరు డేట్‌ను పట్టారు.. ఆ సెంటిమెంట్ డేట్​కే ప్రభాస్ ‘కల్కి’

అల వైకుంఠపురంలో వచ్చినప్పుడు ఇది సీనియర్ ఎన్టీఆర్ హిట్ మూవీ ఇంటి గుట్టు కాపీ అన్నారు. అన్నట్టుగానే పిల్లల్ని మార్చే కాన్సెప్ట్ కనిపించటంతో త్రివిక్రమ్ కథని లిఫ్ట్ చేశాడని తేల్చేశారు. ఇక అరవింద సమేత వీరరాఘవలో మొండి కత్తి కాన్సెప్ట్ రాయల సీమ రైటర్ నుంచి కాపీ కొట్టి, తర్వాత డబ్బుతో సరిదిద్దాడనే కామెంట్స్ వచ్చాయి. ఇక పవర్ స్టార్ అజ్ఞాతవాసి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత బెటర్. ఎందుకంటే అది ఫ్రెంచ్ మూవీ ది లార్గో వించ్‌కి మక్కీకి మక్కీ కాపీ. ఈ చిత్ర డైరెక్టర్ కూడా అప్పట్లో ట్వీట్లు పెట్టడం, దేశవ్యాప్తంగా గురుజీ మీద విమర్శలు రావటం జరిగింది. అంతెందుకు అ..ఆ మూవీకి కూడా ఇలాంటి వివాదమే వచ్చింది.

మీనా మూవీకి అ.. ఆ.. రీమేక్. అయినా అసలు రైటర్స్‌కి క్రెడిట్ ఇవ్వకుండా, ఇది రీమేక్ అని చెప్పకుండా తప్పు చేశాడు. తర్వాత కామెంట్ల దాడి పెరగటంతో టెక్నికల్ ఎర్రర్ అని సర్ది చెప్పారు. ఇవన్నీ చూశాక గుంటూరు కారం ఒరిజినల్ మిర్చీలతో కాదు, కాపీ కొట్టి కల్తీ మిరపతో నూరిన కారం అనేస్తున్నారు.