Guntur Kaaram: త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సూపర్ స్టార్ మహేశ్ బాబు చేసే గుంటూరు కారం మూవీ.. సూపర్ స్టార్ కృష్ణ ఓల్డ్ మూవీకి కాపీ అంటున్నారు. బేసిగ్గా తండ్రి మూవీనే కొడుకు చేస్తున్నాడంటే రీమేక్ అనాలి. లేదంటే ఆ సినిమా కథ ప్రేరణగా తీసుకుని ఈ సినిమా తీస్తున్నాడనాలి. కానీ కాపీ కామెంట్లు పెరిగాయి. గుంటూరు కారం గ్లింప్స్ మాత్రమే ఇప్పటివరకు వచ్చింది. అందువల్ల టీజర్, ట్రైలర్ కూడా రాకముందే ఇది కాపీ అనటం సమంజసం కాదు. కాని వస్తున్న గుసగుసలు మాత్రం షాక్ ఇచ్చేలా ఉన్నాయి.
త్రివిక్రమ్ కూడా గతంలో కాపీ కబుర్లు బానే చెప్పాడు. యద్దనపూడి సులోచనా రాణి రాసిన నవలను గతంలో మీనా మూవీగా తీయగా, అప్పట్లో హిట్ అయిన అదే మూవీని త్రివిక్రమ్ అ..ఆ.. అంటూ ఫ్రీమేక్ చేశాడు. కాని ఎక్కడా రీమేక్ అని చెప్పలేదు. కనీసం యద్దనపూడి సులోచనా రాణికి క్రెడిట్ ఇవ్వలేదు. ఇక అ ఆ మూవీ రిలీజయ్యాక కాపీ కామెంట్స్ పెరగటంతో అప్పడు టెక్నికల్ మిస్టేక్ అని తప్పుని సరిదిద్దుకున్నాడు. ఇదే కాదు.. లాస్ట్ టైం తను తీసిన అల వైకుంఠపురంలో మూవీ సీనియర్ ఎన్టీఆర్ హిట్ మూవీ ఇంటిగుట్టు స్టోరీ లైన్ కాపీనే. అంతెందుకు పవన్‌తో తను తీసిన ఫ్లాప్ మూవీ అజ్ఞాతవాసి అయితే ఫ్రెంచ్ సినిమా లార్గో వించ్ మూవీ కాపీ. అదప్పట్లో వివాదం కూడా అయ్యింది. అరవింద సమేత వీరరాఘవలో కూడా మొండికత్తి స్టోరీ రాయలసీమ వాసి నుంచి ఎత్తిందే అన్నారు. ఆ కాపీ వివాదాన్ని క్యాష్‌తో సరిదిద్దాడన్నారు. అంతా ఓకే కాని.. గుంటూరు కారం మూవీ కూడా కాపీ అనటానికి రీజన్ ఉందట.
ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తున్న గుసగుసల ప్రకారం, ఇది సూపర్ స్టార్ కృష్ణ హిట్ మూవీ కృష్ణావతారం ఫ్రీమేక్ అని తెలుస్తోంది. అందులో ఓ ఇంటి సమస్యను తీర్చేందుకు వచ్చిన కృష్ణ మీద విజయశాంతి మనసు పారేసుకుంటుంది. శ్రీదేవి త్యాగం చేయబోతుంది. కాకపోతే గుంటూరు కారంలో ఇంటి సమస్యను మిర్చి యార్డ్ సమస్యగా మార్చారట. శ్రీదేవి ప్లేస్‌లో శ్రీలీల, విజయశాంతి ప్లేస్‌లో మీనాక్షి చౌదరిని తీసుకున్నారట.