GUNTUR KAARAM: ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో మహేశ్ సరికొత్త రికార్డు.. గుంటూరు కారం ఎన్ని షోలంటే..

హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రముఖ మల్టిప్లెక్స్ థియేటర్ ప్రసాద్స్ ఐమాక్స్‌లో గుంటూరు కారం మూవీకి సంబంధించి ఫస్ట్ డే 41 షోస్ పడనున్నాయి. ఈ విషయాన్ని థియేటర్ యాజమాన్యం అధికారకంగా ప్రకటించింది.

  • Written By:
  • Publish Date - January 10, 2024 / 04:30 PM IST

GUNTUR KAARAM: సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక సినిమాలో.. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యిద్దో.. ఆడే పండుగాడు అనే డైలాగ్ చెప్తాడు. ఏ ముహూర్తాన మహేష్ ఆ డైలాగ్ చెప్పాడో గాని ఇప్పుడు ఆ మాట అక్షర సత్యంగా నిలిచింది. తన నయా మూవీ గుంటూరు కారంతో ఎవరికీ సాధ్యం కానీ ఒక రికార్డుని సృష్టించి తెలుగు చిత్ర పరిశ్రమకి తనెంత స్పెషల్ హీరోనో మరోసారి చాటి చెప్పాడు. హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రముఖ మల్టిప్లెక్స్ థియేటర్ ప్రసాద్స్ ఐమాక్స్‌లో  గుంటూరు కారం మూవీకి సంబంధించి ఫస్ట్ డే 41 షోస్ పడనున్నాయి.

Guntur Karam pre-release :గుంటూరు గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్

ఈ విషయాన్ని థియేటర్ యాజమాన్యం అధికారకంగా ప్రకటించింది. దీంతో ఇండియన్ సినిమా హిస్టరీలో ప్రసాద్ ఐమాక్స్‌లో 41 షోస్ పడుతున్న మొట్టమొదటి చిత్రంగా గుంటూరు కారం నిలిచింది. ఆల్రెడీ బుక్ మై షో లాంటి ఆన్ లైన్ యాప్స్‌లో టికెట్స్ కూడా ఫుల్ అయిపోవడం గమనార్హం. ఇప్పుడు ఈ విషయంతో మహేష్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. పైగా మహేష్ నుంచి సినిమా రావడం లేట్ అయినా కూడా మహేష్ రేంజ్ మాత్రం తగ్గదు అని అంటున్నారు.

జనవరి 11 మిడ్ నైట్ నుంచే గుంటూరు కారం షోస్ పెద్ద ఎత్తున రెండు తెలుగు రాష్ట్రాల్లో పడనున్నాయి. ఆల్రెడీ థియేటర్స్ దగ్గర మహేష్ అభిమానుల హాడావిడి మొదలయ్యింది. పెద్ద ఎత్తున మహేష్ కటౌట్‌లని ఏర్పాటు చేస్తున్నారు. బాబు లాండ్ అయ్యాడంటే అపోజిషన్‌కి బ్యాండే అంటూ సందడి చేస్తున్నారు.