Guntur Kaaram: ప్రోమోనే బాగుంది ! గుంటూరు కారం సాంగ్‌ రివ్యూ..

రిలీజ్ అయిన నిమిషాల్లోనే వేల లైక్‌లు, లక్షల వ్యూస్ వచ్చినా.. సాంగ్‌లో మాత్రం దమ్ము ఉన్నట్లు అనిపించడం లేదు. ప్రోమోలో విన్నంతవరకే బాగుంది.. ఫుల్‌సాంగ్‌ అంతగా కనెక్ట్‌ కావడం లేదు. సాంగ్‌ వింటుంటే.. హీరో ఇంట్రడక్షన్‌ సాంగ్‌లా అనిపిస్తోంది.

  • Written By:
  • Publish Date - November 7, 2023 / 04:44 PM IST

Guntur Kaaram: మసాలా లేని బిర్యానీ ఎప్పుడైనా తిన్నారా.. అప్పుడు అదెందుకు బిర్యానీ అవుతుందని ఎదురు ప్రశ్నలు వేయకండి. గుంటూరు కారం (Guntur Kaaram) సాంగ్ వింటే ఇలాంటి రకరకాల అనుమానాలు స్టార్ట్ అవుతాయ్ చాలా ! గురూజీ త్రివిక్రమ్‌ (Trivikram) బర్త్‌డే స్పెషల్‌గా మహేశ్ బాబు (Mahesh Babu) నటిస్తున్న గుంటూరు కారం మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసింది మూవీ టీమ్. దమ్ మసాలా (Dum Masala) పేరుతో ఈ పాట విడుదల చేయగా.. పాటలో దమ్ములేదు.. మసాలా లేదు అన్నట్లు అనిపించింది.

Varun Tej: ఓటీటీలో వరుణ్‌-లావణ్య పెళ్లి.. అమ్మో.. డీల్ అన్ని కోట్లా..

మాములుగా థమన్‌ (Thaman S) పాటలు ఎప్పుడో, ఎక్కడో విన్నట్లు అనిపిస్తుంటాయ్. ఆ సమయానికి క్లిక్‌ అయితే పర్లేదు కానీ.. లేదంటే అంత ఈజీగా కనెక్ట్ కాలేం. అలాంటిదే గుంటూరు కారం టైటిల్ సాంగ్‌ కూడా! రిలీజ్ అయిన నిమిషాల్లోనే వేల లైక్‌లు, లక్షల వ్యూస్ వచ్చినా.. సాంగ్‌లో మాత్రం దమ్ము ఉన్నట్లు అనిపించడం లేదు. ప్రోమోలో విన్నంతవరకే బాగుంది.. ఫుల్‌సాంగ్‌ అంతగా కనెక్ట్‌ కావడం లేదు. సాంగ్‌ వింటుంటే.. హీరో ఇంట్రడక్షన్‌ సాంగ్‌లా అనిపిస్తోంది. మాములుగా త్రివిక్రమ్ సినిమాల్లో.. హీరో ఇంట్రడక్షన్ సాంగ్ అంటే ఈజీగా కనెక్ట్ అయిపోతారు ఆడియెన్స్‌. ఈ సాంగ్‌లో అలా కనిపించడం లేదు. హీరో కేరక్టరైజేషన్‌ ఎలివేట్‌ చేస్తూ లిరిక్స్ వినిపిస్తున్నా అబ్బా అనిపించే ఒక్క మూమెంట్‌ కూడా లేదు సాంగ్‌లో! 3 నిమిషాల 33 సెకన్ల నిడివితో సాంగ్ రిలీజ్ చేశారు. బీడీ తాగుతూ.. విలన్‌లను బాదేస్తూ.. మహేష్‌ స్వాగ్ కేక పుట్టించినా.. సాంగ్‌లో మాత్రం దమ్ము కనిపించలేదు. లిరిక్స్ అనుకున్న స్థాయిలో లేవు అని కామెంట్లు పెట్టేస్తున్నారు ప్రేక్షకులు.

Renu Desai: ఐష్‌కు రేణు నో.. పవన్ కళ్యాణ్ కోసం ఐశ్వర్య రాయ్‌ని వదిలేసుకున్న రేణు దేశాయ్

గురూజీ సినిమా అయినా.. ఆయన సినిమాలో సాంగ్ అయినా.. జనాలు భారీ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటారు. అలాంటిది అప్‌ టు ది మార్క్ అన్నట్లుగా సాంగ్‌ వినిపించలేదు. ప్రోమోలో వినిపించిన ట్రాక్ పర్లేదు కానీ.. ఓవరాల్‌ సాంగ్‌ స్లోగా సాగినట్లు అనిపించింది అనే చర్చ జరుగుతోంది. ఐతే యూట్యూబ్‌లో 1.25 స్పీడ్‌తో వింటే సాంగ్ మరో లెవల్‌ అనిపిస్తోంది. గురూజీ ఇలాంటి లిరిక్స్ రాయించుకున్నారన్నా.. ఇలాంటి ట్యూన్‌ చేయించుకున్నా.. భారీ ప్లాన్ ఉంటుంది అని మరికొందరు ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఒక్కటి మాత్రం క్లియర్‌.. సాంగ్‌తో హీరో ప్రొఫెషన్ ఏంటి.. కేరక్టరైజేషన్ ఏంటి అన్నది మాత్రం క్లియర్‌గా చెప్పారు. బాబు గొడ్డుకారం అని, బుర్రిపాలెం బుల్లోడు.. తెలీనోడు ఎవడు, ఈడితో బేరం అంటూ సాగే కొన్ని పదాలు పర్లేదు అనిపించాయ్.