Trivikram : గురూజీ ఆ రెండూ వదిలేయాలి

భారీ అంచనాలతో సంక్రాంతి బరిలోకి దిగిన గుంటూరు కారం మూవీ.. గురూజీ త్రివిక్రమ్‌ (Trivikram)కి ఘాటు అనుభవాన్ని మిగిల్చింది.. సూపర్ స్టార్ (Superstar Mahesh) మహేశ్ (Mahesh) - త్రివిక్రమ్ (Trivikram) కాంబోలో భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ మూటగట్టుకుంది.. కలెక్షన్ల పరంగా పర్వాలేదనిపించినా.. మహేశ్‌కు ఇమేజ్‌కు తగ్గ హిట్ పడకపోవడంతో ఫ్యాన్స్ బాగా డిజప్పాయింట్ అయ్యారు.. తివిక్రమ్‌పై సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు..

భారీ అంచనాలతో సంక్రాంతి బరిలోకి దిగిన గుంటూరు కారం మూవీ.. గురూజీ త్రివిక్రమ్‌ (Trivikram)కి ఘాటు అనుభవాన్ని మిగిల్చింది.. సూపర్ స్టార్ (Superstar Mahesh) మహేశ్ (Mahesh) – త్రివిక్రమ్ (Trivikram) కాంబోలో భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ మూటగట్టుకుంది.. కలెక్షన్ల పరంగా పర్వాలేదనిపించినా.. మహేశ్‌కు ఇమేజ్‌కు తగ్గ హిట్ పడకపోవడంతో ఫ్యాన్స్ బాగా డిజప్పాయింట్ అయ్యారు.. తివిక్రమ్‌పై సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు.. త్రివిక్రమ్ స్థాయికి తగ్గ సినిమా కాదంటూ బహిరంగంగా కామెంట్లు పెట్టారు.. ముఖ్యంగా ఈ మూవీలోని కుర్చీ మడతెట్టి పాటపై విపరీతమైన ట్రోలింగ్ వచ్చింది.. దీంతో.. తివ్రిక్రమ్ నెక్ట్స్‌ మూవీస్‌పై ఇప్పటి నుంచే హాట్ డిస్కషన్ నడుస్తోంది..

గుంటూరు కారం మూవీ స్టోరీ లైన్ . త్రివిక్రమ్ తీసిన ముందు సినిమాలకు కిచిడీలా ఉందన్న కామెంట్లు వచ్చాయి. ఈ విషయంపై త్రివిక్రమ్ మహేశ్ ఫ్యాన్స్ (Mahesh Fans) నుంచి ఫుల్ ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వచ్చింది. నెటిజన్లు త్రివిక్రమ్‌ను ఓ ఆట ఆడుకున్నారనే చెప్పాలి. మహేశ్ యాక్టింగ్ బాగుందని, త్రివిక్రమ్ స్టోరీ టెల్లింగ్ సెట్ కాలేదని కామెంట్లు చేశారు. గత సినిమాల్లోని పాయింట్లనే మళ్లీ గురూజీ నెరేట్ చేయడమే ఈ సినిమాపై నెగిటివిటీ క్రియేట్ కారణమన్న కామెంట్లు వినిపించాయి. జులాయి, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి (Agnyathavasi), S/o సత్యమూర్తి సినిమాల్లో హీరోలు.. ఏదో సాధించడానికి వేరే ఊరు వెళ్తారు. గుంటూరు కారంలో కూడా అదే ఫ్లేవర్ కనిపించడంతో ప్రేక్షకులు బోర్ ఫీలయ్యారు.

అంతేకాదు.. తన గత చిత్రాల్లో కనిపంచే సంతకాలు సీన్లు కూడా గుంటూరు కారం సినిమాలో రిపీట్ అయ్యింది. పవన్ అత్తారింటికి దారేదిలో హోటల్ పత్రాలపై హీరో అత్త సంతకం చేసే సీన్ ఉంటుంది. S/o సత్యమూర్తి (S/o Satyamurthy) లో హీరో టార్గెట్ కూడా ఒక డాక్యుమెంట్ పై సంతకం చేయించడమే. ఇక గుంటూరు కారంలో కూడా ఈ ఎలిమెంట్స్ కనిపిస్తాయి. సిగ్నేచర్ సీన్ తో ఈ సినిమా స్టార్ట్ అవుతోంది.. సో.. గుంటూరు కారం మూవీ చూస్తున్నంత సేపూ.. ప్రేక్షకులకు ఈ నాలుగు సినిమాలు మదిలో మెదలడంతో.. కొత్త సినిమా చూస్తున్న ఫీల్ కలగలేదు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడిచింది. ఇక.. ఇప్పుడు త్రివిక్రమ్ చేయబోయే నెక్స్ట్ మూవీస్‌లో అయినా సరే ఈ రెండు విషయాలు వదిలేయాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఈ రెండు విషయాలు వదిలేస్తేనే.. త్రివిక్రమ్‌లోని అసలైన గురూజీ బయటకు వస్తారని అంటున్నారు. మరి.. నెటిజన్ల కోరికను త్రివిక్రమ్ ఎంత వరకు నెరవేరుస్తారో తెలియాలంటే ఆయన నెక్స్ట్ మూవీ వరకు ఆగాల్సిందే..