HANUMAN: హనుమాన్ డైరెక్టర్ చేతిలో బాలీయ్య డ్రీమ్ ప్రాజెక్టు

ప్రశాంత్ వర్మ తన దగ్గరున్న కథని, బాలయ్య చెప్పిన ఆదిత్య 999 పాయింట్‌ని కలిపి కొత్త కథ రెడీ చేసే పనిలో ఉన్నాడు. విచిత్రం ఏంటంటే ఇంత పెద్ద హీరో మూవీ ఆఫర్ పట్టడమే కాదు, బాలయ్య వారసుడు మోక్షజ్ఞని హీరోగా లాంచ్ చేసే బాధ్యతని కూడా ఇప్పుడు ప్రశాంత్ వర్మే మోసేలా ఉన్నాడు.

  • Written By:
  • Publish Date - January 12, 2024 / 06:30 PM IST

HANUMAN: బాలయ్య ప్రజెంట్ బాబీ మేకింగ్‌లో ఓ మూవీ చేస్తున్నాడు. తర్వాత ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 చేసేందుకు రెడీ అయ్యాడు. ఆల్రెడీ హనుమాన్ (HANUMAN) ఫేం ప్రశాంత్ వర్మ ఓ కథని చెప్పాడట. తను కూడా ఆదిత్య 369, భైరవ ద్వీపం లాంటి ఓ కథని బాలయ్యకు చెప్పినట్టు, హనుమాన్ హిట్ అయితే ఆ ప్రాజెక్ట్ తనకి దక్కొచ్చని ప్రచారం జరుగుతోంది. విచిత్రం ఏంటంటే హనుమాన్ టాక్ కిక్ ఇస్తోంది అంటే, ప్రశాంత్ వర్మకి బాలయ్య ప్రాజెక్ట్ కన్ఫామ్ అయ్యిందనుకోవాల్సి వస్తోంది.

Guntur Kaaram Review: ఇలా చేసావేంటి ర‌మ‌ణా..? గురూజీని.. కుర్చీ మడతపెట్టి..!

కాకపోతే బాలయ్యే ఆదిత్య 999 స్టోరీ లైన్ ఇచ్చి ఆ పాయింట్‌తో కథ చెప్పమన్నాడట. దీంతో ప్రశాంత్ వర్మ తన దగ్గరున్న కథని, బాలయ్య చెప్పిన ఆదిత్య 999 పాయింట్‌ని కలిపి కొత్త కథ రెడీ చేసే పనిలో ఉన్నాడు. విచిత్రం ఏంటంటే ఇంత పెద్ద హీరో మూవీ ఆఫర్ పట్టడమే కాదు, బాలయ్య వారసుడు మోక్షజ్ఞని హీరోగా లాంచ్ చేసే బాధ్యతని కూడా ఇప్పుడు ప్రశాంత్ వర్మే మోసేలా ఉన్నాడు. ఫిబ్రవరిలో దీనిపౌ ఎనౌన్స్‌మెంట్ ఉండొచ్చని తెలుస్తోంది.

మరోవైపు హనుమాన్ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. నెమ్మదిగా థియేటర్లు పెంచుతున్నారు. దీంతో కలెక్షన్లు పెరిగే అవకాశం కూడా ఉంది. ఉత్తరాదిలోనూ ఈ చిత్రానికి మంచి ఆదరణ దక్కుతోంది.