Hanuman : హనుమాన్ పవర్

బాక్సాఫీస్‌ (Box Office) వద్ద ‘హనుమాన్‌’ (Hanuman) ప్రభంజనం సృష్టిస్తున్నాడు.. రికార్డుల దుమ్ము దులుపుతున్నారు.. స్టార్‌ హీరోల సినిమాలతో పోటీ పడి మరీ సంక్రాంతి బరిలో విజేతగా నిలిచాడు.. కేవలం 25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీని.. ప్రశాంత్ వర్మ ఓ వండర్‌గా తీర్చిదిద్దాడు. హాలీవుడ్‌ రేంజ్‌ గ్రాఫిక్స్‌తో, సూపర్ టేకింగ్‌తో వాహ్‌వా అనిపించాడు

 

 

 

బాక్సాఫీస్‌ (Box Office) వద్ద ‘హనుమాన్‌’ (Hanuman) ప్రభంజనం సృష్టిస్తున్నాడు.. రికార్డుల దుమ్ము దులుపుతున్నారు.. స్టార్‌ హీరోల సినిమాలతో పోటీ పడి మరీ సంక్రాంతి బరిలో విజేతగా నిలిచాడు.. కేవలం 25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీని.. ప్రశాంత్ వర్మ ఓ వండర్‌గా తీర్చిదిద్దాడు. హాలీవుడ్‌ రేంజ్‌ గ్రాఫిక్స్‌తో, సూపర్ టేకింగ్‌తో వాహ్‌వా అనిపించాడు.. డే వన్ నుంచే క్లీన్ హిట్‌ టాక్ సొంతం చేసుకుంది. ప్రజెంట్ బ్లాక్ బస్టర్ వసూళ్లతో దూసుకుపోతోంది. ఓవర్సీస్ లో 4 మిలియన్ డాలర్స్‌తో రికార్డులు బద్దలు కొడుతోంది.

ప్రశాంత్‌ వర్మ (Prashanth Varma) తెరకెక్కించిన హనుమాన్‌ మూవీలో తేజ సజ్జా (Teja Sajja) హీరోయిన్‌గా నటించాడు. అమృతా అయ్యర్‌ కథానాయికగా మెరిసింది. వరలక్ష్మీ శరత్ కుమార్‌, వినయ్‌ రామ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. బరిలో స్టార్‌ హీరోల సినిమాలు ఉన్నా, థియేటర్లు పరిమిత సంఖ్యలోనే దొరికినా పాజిటివ్‌ టాక్‌ రావడంతో వసూళ్లలో దూసుకుపోతోంది హనుమాన్‌. చాలా చోట్ల ఈ మూవీ టికెట్లు దొరకడం గగనంగా మారిపోయిందంటే.. హనుమాన్‌ ప్రభజనం ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు..

వరల్డ్ వైడ్‌గా హనుమాన్‌పై కాసుల వర్షం కురుస్తోంది.. రోజులు గడుస్తున్న కొద్దీ థియేటర్ల సంఖ్య పెరగడం ఆశ్చర్యం కలిగిస్తోంది.. ఈ క్రేజ్‌ను హనుమాన్ టీమ్ కూడా ఊహించి ఉండకపోవచ్చు..ఫస్ట్ వీక్‌ కంప్లీట్ అయ్యే వరకు 150 కోట్ల గ్రాస్ రాబట్టిన హనుమాన్.. 200 కోట్ల దిశగా దూసుకుపోతోంది. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 170 కోట్లకు పైగా గ్రాస్ కొల్లగొట్టింది.. మళ్లీ వీకెండ్ మొదలైంది కాబట్టి… మండే వరకు 200 కోట్ల క్లబ్‌లో చేరి సెన్సేషన్ క్రియేట్ చేయబోతోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.. ఇదే నిజమైతే.. చిన్న సినిమాల లిస్ట్‌లో పెద్ద హిట్‌ కొట్టిన సినిమాగా కూడా హనుమాన్‌ రికార్డు సృష్టించబోతున్నట్లే..