Hanuman movie banned : శ్రీలంకలో హనుమాన్‌ సినిమా బ్యాన్‌.. అసలు కారణం ఏంటంటే..

కంటెంట్‌ కరెక్ట్‌గా ఉంటే చాలు చిన్న హీరో పెద్ద హీరో తేడా లేకుండా సినిమాను బ్లాక్‌బస్టర్‌ (Blockbuster) చేసి పడేస్తారు తెలుగు ఆడియన్స్‌. కేవలం తెలుగు ఆడియన్స్‌ (Telugu Audience) మాత్రమే కాదు.

 

కంటెంట్‌ కరెక్ట్‌గా ఉంటే చాలు చిన్న హీరో పెద్ద హీరో తేడా లేకుండా సినిమాను బ్లాక్‌బస్టర్‌ (Blockbuster) చేసి పడేస్తారు తెలుగు ఆడియన్స్‌. కేవలం తెలుగు ఆడియన్స్‌ (Telugu Audience) మాత్రమే కాదు. సగటు సినిమా అభిమాని ప్రతీ ఒక్కరికీ కావాల్సింది మంచి కంటెంట్‌. ఇదే విషయాన్ని హనుమాన్‌ (Hanuman) సినిమా మరోసారి ప్రూవ్‌ చేసింది. తేజా సజ్జా (Teja Sajja), ప్రశాంత్‌ వర్మ (Prashant Varma) కాంబినేషన్‌లో వచ్చిన హనుమాన్‌ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మూడు రోజుల్లోనే ఈ సినిమా 45 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.

కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఎక్రాస్‌ ఇండియా హనుమాన్‌ కలెక్షన్లు.. పెద్ద సినిమాలను పక్కన పెట్టేస్తున్నాయి. అయితే ఇక్కడ విషయం సినిమా కలెక్షన్ల గురించో రికార్డుల గురించో కాదు.. ఈ సినిమాకు శ్రీలంకకు ఉన్న సంబంధం గురించి. హనుమాన్‌ సినిమాను శ్రీలంక గవర్నమెంట్‌ తమ దగ్గర రిలీజ్‌ అవ్వకుండా బ్యాన్‌ చేసింది. ఎందుకు బ్యాన్‌ చేసింది అనే క్వశ్చన్‌ అడిగి వేస్ట్‌. ఎందుకు బ్యాన్‌ చేసిందో ప్రపంచం మొత్తం తెలుసు. అశోకవనంలో సీతను చూసి రమ్మంటే శ్రీలంక వెళ్లి హనుమంతుడు ఏం చేసి వచ్చాడో రామాయణం చదివిన ప్రతీ ఒక్కరికీ తెలుసు.

ఆ రేంజ్‌ ట్రీట్‌మెంట్‌ ఇచ్చిన తరువాత లంకవాసులకు హనుమంతుడు అంటే ఇష్టం ఉంటుందా చెప్పండి. అలాంటి హనుమాన్‌ సినిమాను వాళ్ల దేశంలో రిలీజ్‌ కానిస్తారా. అందుకే ఈ సినిమాను శ్రీలంక ప్రభుత్వం బ్యాన్‌ చేసింది. అయితే ఇదే విషయంపై ఇంటర్నెట్‌లో సెటైర్లు పేలుస్తున్నారు ఇండియన్‌ నెటిజన్లు. అప్పుడు హనుమాన్‌ పెట్టిన మంట ఇంకా తగ్గినట్టు లేదు.. అందుకే ఇప్పటికీ బ్యాన్‌ చేస్తున్నారు అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. వింత వింత మీమ్స్‌ క్రియేట్‌ చేసి శ్రీలంక గవర్నమెంట్‌ను (Sri Lankan Government) ఆడుకుంటున్నారు. సినిమా రిలీజ్‌ చేసేందుకు కూడా వెనకాడుతున్నారంటే భయం బాగానే ఉంది.. ఇదే మెయిన్‌టేన్‌ చేయండి అంటూ పరువు తీసి పడేస్తున్నారు.