HANUMAN: హనుమాన్ కాదు.. కాదు.. హనుమ్యాన్.. బాక్సాఫీస్ దుమ్ము దులుపుతున్నాడు. స్టార్ హీరోల సినిమాలతో పోటీ పడి మరీ.. రికార్డు స్థాయి కలెక్షన్లు సాధిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన హనుమాన్.. బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్‌లో చేరింది. ఈ సినిమా వాల్డ్ వైడ్‌గా ఇప్పటివరకు వంద కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని తెలుపుతూ మేకర్స్ తాజాగా ఓ పోస్టర్ వదిలారు.
Hanuman: జై చిరంజీవ.. హనుమాన్ చెడుగుడు.. వైరల్‌గా మారిన చిరంజీవి వ్యాఖ్యలు
హనుమాన్ వంద కోట్ల క్లబ్‌లో చేరిన సందర్భంగా దర్శక నిర్మాతలు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. హీరో తేజ సజ్జా అయితే.. ఇది తనకి జెర్సీ మూమెంట్ అంటూ ఆనందం వ్యక్తం చేశాడు. కేవలం రూ.25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన హనుమాన్‌కు.. లాభాల పంట పండింది. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ మూవీలో తేజ సజ్జా హీరోగా నటించాడు. అమృతా అయ్యర్ కథానాయికగా మెరిసింది. వరలక్ష్మీ శరత్ కుమార్, వినయ్ కీలక పాత్రలు పోషించారు. బరిలో స్టార్ హీరోల సినిమాలు ఉన్నా, థియేటర్లు పరిమిత సంఖ్యలోనే దొరికినా.. పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లలో దూసుకుపోతోంది హనుమాన్. చాలా చోట్ల ఈ మూవీ టికెట్లు దొరకడం కష్టంగా మారిపోయింది. నాలుగో రోజైన సోమవారం.. తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.11 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. అంటే మొదటి రోజు వసూళ్ల కంటే ఇది రెట్టింపు. సంక్రాంతితో పాటు వరుసగా సెలవులు రావడం హనుమాన్ జోరుకు కారణంగా కనిపిస్తోంది.
మొదటి వీకెండ్‌లో వాల్డ్‌వైడ్‌గా రూ.73 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన హనుమాన్.. నాలుగో రోజు మరో రూ.24 కోట్లతో మొత్తంగా రూ.97 కోట్ల గ్రాస్ సాధించింది. మంగళవారం కూడా సెలవు కావడంతో.. వందకోట్లు ఈజీగా దాటేసింది. హనుమాన్ మూవీ నార్త్ అమెరికాలో రికార్డులు సృష్టిస్తోంది. అక్కడ 4 రోజుల్లో 3 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. నార్త్ అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 తెలుగు సినిమాల్లో ఒకటిగా హనుమాన్ స్థానం సంపాదించుకుంది. తెలుగు రాష్ట్రాలకు ధీటుగా నార్త్‌లో, ఓవర్సీస్‌లో హనుమాన్‌కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇదే జోరు కొనసాగితే ఈ సినిమా ఫుల్‌రన్‌లో 2వందల కోట్ల గ్రాస్ క్లబ్‌లో చేరినా ఆశ్చర్యం లేదంటున్నాయ్ మార్గెట్ వర్గాలు.