HANUMAN: ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో వచ్చిన హనుమాన్ క్రియేట్ చేస్తున్న రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ఈ మూవీ టీమ్ పడిన అవమానాలూ ఎన్నో. నిన్నటిదాకా.. సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారని ఎగతాళి చేసిన నోళ్లే.. ఇప్పుడు హనుమాన్ హిట్ చూసి మూసుకుంటున్నాయ్. కంటెంట్ మీద నమ్మకంతో సినిమానే నడిపిస్తుందని.. థియేటర్లు వాటంతటవే పెరుగుతాయని.. కచ్చితంగా గెలిచి తీరతామని దర్శకుడు ప్రశాంత్ చేసిన శపథం నెరవేరుతోంది.
GUNTUR KAARAM: సూపర్ స్టార్ మహేశ్‌ను ముంచిన త్రివిక్రమ్..
ప్రీమియర్ల నుంచి వచ్చిన అద్భుత స్పందన ఫస్ట్ డే కలెక్షన్‌కు యూజ్ అయింది. తెలంగాణ సంగతి ఎలా ఉన్నా.. ఏపీలో షోలు, స్క్రీన్లు ఒక్కసారిగా పెరుగుతున్నాయ్. సలార్‌ని రీప్లేస్ చేసి మరీ హనుమాన్‌కు ఇస్తున్నారు థియేటర్లు. బుక్ మై షో ట్రెండ్స్‌లోనూ హనుమాన్ సగటు బుకింగ్స్ గంటకు 18 వేల టికెట్ల దాకా ఉన్నాయ్. గుంటూరు కారం టిక్కెట్లు ఒక్కసారిగా స్లో అయ్యాయ్. 12 వేల దగ్గరకు పడిపోయాయ్. హనుమాన్ పవర్ ముందు.. గుంటూరు కారం ఘాటు తగ్గింది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. మౌత్ టాక్ క్రియేట్ చేస్తున్న సెన్సేషన్ అంతా ఇంతా కాదు. నైజాంలో ఇంకా ఎక్కువ స్క్రీన్లు దొరికి ఉంటే హనుమాన్ రచ్చ ఇంకో స్థాయిలో ఉండేదని బయ్యర్ల కామెంట్. ఇక అటు ఉత్తరాది రాష్ట్రాల్లోనూ మెల్లగా మొదలైన ఊపు క్రమంగా పెరుగుతోంది. హిందీలో స్ట్రెయిట్‌గా రిలీజ్ అయిన మెర్రీ క్రిస్మస్ కంటే హనుమాన్‌ను చూసేందుకే ఆడియన్స్ ఇష్టపడుతున్నారు.
సంక్రాంతి రేసులో ఇంకా రెండు సినిమాలు ఉన్నాయి. దీంతో వాటి స్టేటస్ తేలాకే హనుమాన్ దూకుడు ఏ స్థాయిలో పెరుగుతుందనేది డిసైడ్ అవుతుంది. తేజ సజ్జా లాంటి అప్‌కమింగ్ హీరోకి ఇది అనూహ్యమైన ఓపెనింగే. మహేష్ సునామి ముందు నిలవగలడా అనే అనుమానాలు పటాపంచలు చేస్తూ.. హనుమంతుడి అండతో తట్టుకోవడం ఇప్పటికిప్పుడు స్టార్‌డమ్ తీసుకురాదు. కానీ.. పెద్ద బ్యానర్లు, బడా ప్రొడ్యూసర్లు దగ్గరికొచ్చేలా చేస్తుంది. ప్రశాంత్ వర్మ సంగతి చెప్పనక్కర్లేదు. జై హనుమాన్‌తో పాటు మొత్తం 12 చిత్రాలతో ప్లాన్ చేసుకున్న సినిమాటిక్ యూనివర్స్‌కు రూట్ క్లియర్ అయింది.