HANUMAN: మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం 12న వస్తోంది. పెద్ద హీరో.. రూ.250 కోట్ల వరకు బడ్జెట్.. భారీ స్తాయిలో రిలీజ్ చేస్తే తప్ప పెట్టుబడి రాదు. ఆల్రెడీ నైజాం రైట్స్ దిల్ రాజు కొనేశాడు. కాబట్టి తనకి లాభాలు రావాలంటే సాధ్యమైనంత వరకు ఎక్కువ థియేటర్స్‌లో ఇదే మూవీ విడుదలయ్యేలా చేస్తాడు. ఇది కామన్. కానీ, ఇక్కడే గుంటూరు కారం మూవీ.. హనుమాన్ సినిమాను తొక్కేస్తోంది. ఎప్పుడో రావాల్సిన హనుమాన్ ఈ పండక్కే రావటానికి, రిలీజ్ డేట్ మార్చకపోవటానికి చాలా కారణాలున్నాయి.
GUNTUR KAARAM: గుంటూరు కారం ప్రి రిలీజ్ ఈవెంట్ గెస్టుగా పవన్..?
ఒకటి టీజర్ పేలిందని పాన్ ఇండియా లెవల్లో విడుదల చేసేందుకే గత రిలీజ్ డేట్ వద్దని వాయిదా వేశారు. 12 కోట్ల సినిమాకు మరో 13 కోట్లు యాడ్ చేసి గ్రాఫిక్స్ క్వాలిటీ పెంచారు. దీనికి తోడు అయోధ్య రామాలయం ప్రారంభమయ్యేందుకు కనీసం రెండు వారాల ముందు హనుమాన్ మూవీని విడుదల చేస్తే, నార్త్ మార్కెట్లో వసూళ్ల వర్షం కురిసే ఛాన్స్ ఉంది. అదే.. అసలైన కలిసొచ్చే సీజన్. కానీ అదే సమయంలో గుంటూరు కారం విడుదల కాబోతోంది. కాబట్టి.. పోటీ ఎందుకని జనవరి 19కి విడుదల చేద్దామంటే, వన్ వీక్ గ్యాప్‌లో బాలీవుడ్ మూవీ ఫైటర్ వస్తోంది. దీంతో అక్కడ పోటీ తప్పదు. కాబట్టి ఈనెల 12న హనుమాన్ విడుదల చేస్తేనే 12 నుంచి 25 వరకు నార్త్ ఇండియాలో భారీగా థియేటర్స్ దొరకుతాయి. నార్త్‌లో అయోధ్య మందిరం ప్రారంభోత్సవం టైంలో వస్తే చిన్న సినిమా కూడా దుమ్ముదులిపే ఛాన్స్ ఉంది.
అందుకే తెలుగు మార్కెట్లో గుంటూరు కారం లాంటి పెద్ద సినిమాలతో పోటీ పడే రిస్క్‌కి రెడీ అయ్యి.. హనుమాన్‌ని అదే రోజు విడుదల చేస్తున్నారు. కానీ, నార్త్ మార్కెట్ కోసం పోతే, లోకల్ మార్కెట్ ఎండిపోయేలా ఉంది. ఎందుకంటే, హైదరాబాద్‌లో 70కి పైనే స్క్రీన్స్‌లో 10 థియేటర్స్ కూడా హనుమాన్‌కి దక్కట్లేదట. వైజాగ్‌లో కనీసం ఒక్క థియేటర్ కూడా ఇవ్వట్లేదట. సరే.. మైత్రీ మూవీ మేకర్స్ సాయం అడుగుదామని వెలితే.. వాళ్లు మహేశ్ మీద గౌరవంతో చేతులెత్తేశారు. ప్రొడ్యూసర్ గిల్ట్ నుంచి దిల్ రాజు వరకు అంతా పెద్ద సినిమాకే పెద్ద న్యాయం అంటున్నారు. ఇలా అయితే హనుమాన్ నార్త్ సంగతేమోకాని.. తెలుగులో మాత్రం వెలగటం కష్టంగానే మారుతోంది