Hanuman Movie: హనుమాన్.. గుంటూరు కారం.. ఈ సంక్రాంతి విన్నర్ ఎవరు..?

మహేశ్ మాసివ్ యాక్టింగ్‌తో దుమ్ము రేపినప్పటికీ.. టాక్ పరంగా గుంటూరు కారం మిక్స్‌డ్ రిజల్ట్ అందుకుంది ఈ మూవీ. ఆ తర్వాత వెంకటేశ్‌ సైంధవ్‌.. తర్వాత రోజు నాగార్జున నా సామిరంగా విడుదలయినప్పటికీ అవి బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి.

  • Written By:
  • Updated On - January 19, 2024 / 06:24 PM IST

Hanuman Movie: సంక్రాంతి వచ్చిందంటే తెలుగు ప్రేక్షకులకు సినిమా పండుగ కూడా వచ్చినట్లే. ప్రతి సంక్రాంతికి టాలీవుడ్‌లో సినిమాల జాతర మామూలే. ఈ సంక్రాంతికి కూడా సంక్రాంతి రేసులోకి నాలుగు సినిమాలు వచ్చాయి. భారీ అంచనాలతో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. డిఫరెంట్​ జానర్స్​తో వచ్చిన నాలుగు సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. సంక్రాంతికి ఉండే హైప్ కారణంగా పండగకు నెల రోజుల ముందు నుంచే ఈ సినిమాలపై భారీ డిస్కన్స్ నడిచాయి. బాక్సాఫీస్ దగ్గర ఎవరు దుమ్ము దులిపేస్తారు అన్న అంశంపై అంచనాలు పీక్స్‌కు చేరుకున్నాయి. అయితే ఈ రేసులో కొన్ని బ్లాక్​ బస్టర్ సక్సెస్​ అందుకుని సంక్రాంతి విన్నర్​గా నిలవగా, మరికొన్ని మాత్రం మిక్స్​డ్​ టాక్ అందుకుని సాగుతున్నాయి.

Prabhas: అప్పుడే ఊపేస్తున్న రాజా సాబ్ మేనియా.. రాజా సాబ్.. హిట్టు ప‌క్కా..!

సంక్రాంతి కానుకగా తొలుత హనుమాన్, ‘గుంటూరు కారం’, సినిమాలు బాక్సాఫీస్ ముందుకు వచ్చాయి. అయితే.. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా రేసులోకి వచ్చిన హనుమాన్ మూవీ మాత్రం కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. ప్రీమియర్స్ రూపంలోనే దీనికి అదిరిపోయే టాక్ వచ్చింది. దీనికి ఏకంగా ఇండియా వైడ్‌గా 1000 ప్రీమియర్స్ వేయడం చర్చనీయాంశంగా మారింది. ఆ వెంటనే భారీ హైప్‌తో సంక్రాంతి బరిలోకి దిగిన మూవీ గుంటూరు కారం. మహేశ్ మాసివ్ యాక్టింగ్‌తో దుమ్ము రేపినప్పటికీ.. టాక్ పరంగా మిక్స్‌డ్ రిజల్ట్ అందుకుంది ఈ మూవీ. అయితే.. కలెక్షన్ల పరంగా మాత్రం జోరు కొనసాగిస్తోంది. ఆ తర్వాత వెంకటేశ్‌ సైంధవ్‌.. తర్వాత రోజు నాగార్జున నా సామిరంగా విడుదలయినప్పటికీ అవి బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి. ఈ లెక్కన చూస్తే పండుగ విన్నర్‌గా ‘హనుమాన్’ మూవీ నిలిచింది. సూపర్ హిట్ టాక్ అందుకుని బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్స్​ క్రియేట్​ చేస్తోంది. అటు టాక్​తో పాటు ఇటు కలెక్షన్లు పరంగా దూసుకెళ్తోంది. 4 రోజుల్లోనే రూ.100 కోట్లు వసూలు చేసి కనీవిని ఎరుగని రికార్డులకు తెరతీసింది హనుమాన్.

ముఖ్యంగా ఓవర్సీస్‌లో అయితే 3 మిలియన్లు దాటేసి టాలీవుడ్ టాప్ 10 సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇదే జోరు కంటిన్యూ అయితే ఫుల్ రన్‌లో నాన్ రాజమౌళి, నాన్ ప్రభాస్ రికార్డులన్నింటికీ చెక్ పెట్టేలా కనిపిస్తోంది. అయితే యావరేజ్ నుంచి పాజిటివ్ టాక్‌కు మారిన గుంటూరు కారం కలెక్షన్లు కూడా బాగానే వస్తున్నాయి. థియేటర్స్ ఎలాగూ ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి రానున్న రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయ్యేలా కనిపిస్తుంది. ప్రస్తుతానికి రూ.80 కోట్లకు పైగా షేర్ వసూలు చేసిన ఈ మూవీ మరో రూ.50 కోట్లు వసూలు చేస్తే ఈ సినిమా సేఫ్ జోన్‌కు వస్తుంది.. అయితే.. ఈ సంక్రాంతి వెంకటేశ్‌ను పూర్తిగా డిజప్పాయింట్ చేసింది. సైంధవ్ మొదటి రోజే రేస్ నుంచి తప్పుకుంది. సంక్రాంతి సినిమాల్లో ఫ్లాప్ రిజల్ట్ అందుకుంది. మరోవైపు నాగార్జున నా సావిరంగా మాత్రం మంచి కలెక్షన్స్‌తో ప్రామిసింగ్ మూవీగా నిలిచింది. మొత్తానికి సంక్రాంతి విన్నర్‌గా హనుమాన్ నిలిస్తే.. గుంటూరు కారం, నా సామిరంగా రెండు మూడు స్థానాల్ని సొంతం చేసుకున్నాయి. సైంధవ్ మాత్రం ప్లాప్‌ మూవీగా నిలిచిపోయింది.