టాలీవుడ్ (Tollywood) సంక్రాంతి (Sankranti) రేసులో నిలిచి.. విన్నర్‌గా గెలిచిన హనుమాన్ (Hanuman) ప్రభంజనం మామాలుగా లేదు.. హనుమంతుడి దెబ్బకు కాంతార, కేజీఎఫ్ డబ్బింగ్ వసూళ్ల రికార్డులు కూడా కొట్టుకుపోయాయి. చిన్న సినిమాలు.. పెద్ద సినిమాలకేమీ తీసిపోవని.. కథలో బలముంటే.. కటౌట్‌తో పని లేదని నిరూపించిందీ మూవీ.. కనీవినీ ఎరుగని స్థాయిలో విజయం సాధించడంతో.. పార్ట్ 2 పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.. దానికి తగ్గట్టుగానే ప్రశాంత్ వర్మ కంటెంట్‌ని, స్టార్స్‌ని ఫిక్స్ చేస్తున్నాడట.. ఈ క్రమంలోనే హనుమాన్‌గా రానా.. రాముడుగా మహేశ్ అంటూ… సోషల్ మీడియా (Social Media)లో నడుస్తోన్న డిస్కషన్ హాట్‌టాపిక్‌గా మారింది..
హనుమాన్ -2 (Hanuman 2) పార్ట్‌పై ఇప్పుడు నేషనల్ లెవెల్‌లో డిస్కషన్స్ నడుస్తున్నాయి. ప్రతి ఒక్కరూ ఈ అప్‌కమింగ్ మూవీపై ఎవరి ఇమేజినేషన్స్ వాళ్లు చేసేసుకుంటున్నారు.. ఈ సినిమాలో భళ్లాల దేవుడు రానా హనుమాన్ గా నటించే అవకాశం ఉందని కథనాలొచ్చాయి. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం రోజున రిలీజ్ చేసిన పోస్టర్ లో హనుమాన్ ని రానాతో పోలిక చేస్తూ కొన్ని వార్తలు వినిపించాయి.. ఇంతలో ఇప్పుడు రాముడి పాత్రపైనా నెటిజన్లు చర్చించుకుంటున్నారు. శ్రీరాముడి పాత్రలో సూపర్ స్టార్ మహేష్ నటిస్తే బాగుంటుందంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.. ఈ మూవీలో శ్రీరాముడి పాత్ర మూడు నాలుగు సన్నివేశాల్లో కనిపిస్తుందట.. సో.. ఈ పాత్రను మహేష్ చేస్తే ఎంతో బాగుంటుందంటూ నెటిజన్లు తమ అభిప్రాయలు తెలియజేస్తున్నారు.
అయితే.. కేవలం మూడు నాలుగు సన్నివేశాల్లో కనిపించే పాత్రలో నటించేందుకు మహేశ్ అంగీకరిస్తారా..? అన్నది బిగ్ క్వశ్చన్‌గా మారింది.. దట్ టూ.. ప్రెజెంట్ మహేష్ రాజమౌళితో స్టార్ట్ కాబోయే మూవీ వర్క్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు.. ఇలాంటి టైమ్‌లో ఈ చిన్నపాత్రని చేసే టైమ్ మహేశ్‌కు దొరుకుతుందా అన్నది అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. ప్రశాంత్ వర్మ మాత్రం బాలీవుడ్ స్టార్ సహా దేశంలోని ప్రముఖ తారలను ఎంపిక చేసుకునే పనిలో ఉన్నాడు.. ఇప్పటికే ప్రముఖ బాలీవుడ్ స్టార్ తో టచ్ లో ఉన్నామని, జై హనుమాన్ లో అతడు కీలక పాత్రలో నటించేందుకు ఆస్కారం ఉందంటూ అనౌన్స్ చేశాడు. ఈ టైమ్‌లో మహేష్ శ్రీరాముడిగా నటిస్తే బావుంటుందన్న టాక్ మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.. అయితే.. మరి ఇది జరిగే పనేనా..? కాదా..? అన్నది తేలాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే..