HANUMAN REVIEW: ఊహించని టాక్.. ‘హనుమాన్’ ఫస్ట్ రివ్యూ

ఈ మూవీ విడుదల తేదీ జనవరి 12 కాగా.. స్పెషల్ షోలు, పెయిడ్ ప్రీమియర్లు అంటూ కాస్త ముందుగానే హడావుడి మొదలైంది. అంతేకాదు ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోంది. హనుమాన్ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ వర్మ చక్కగా తెరకెక్కించాడని, ఈ సినిమా అందరినీ అలరిస్తుందని అంటున్నారు.

  • Written By:
  • Publish Date - January 11, 2024 / 04:12 PM IST

HANUMAN REVIEW: సంక్రాంతి బరిలో స్టార్ హీరోల సినిమాలు ఉన్నప్పటికీ.. ‘హనుమాన్’ సినిమా ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షించింది. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సూపర్ హీరో ఫిల్మ్ టీజర్, ట్రైలర్ ఆకట్టుకోవడంతో మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ మూవీ విడుదల తేదీ జనవరి 12 కాగా.. స్పెషల్ షోలు, పెయిడ్ ప్రీమియర్లు అంటూ కాస్త ముందుగానే హడావుడి మొదలైంది. అంతేకాదు ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోంది.

Na Samiranga : కింగ్ నాగార్జున నా సామిరంగ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

హనుమాన్ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ వర్మ చక్కగా తెరకెక్కించాడని, ఈ సినిమా అందరినీ అలరిస్తుందని అంటున్నారు. సినిమాలో భారీతనంతో పాటు, ప్రేక్షకులను మెప్పించే అంశాలు ఎన్నో ఉన్నాయట. పురాణాలను ముడిపెడుతూ బలమైన డ్రామా, ఎమోషన్స్‌తో చిత్రాన్ని మలిచారట. వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా బాగుందట. సినిమాలో ఎన్నో గూస్‌బంప్స్ మూమెంట్స్ ఉన్నాయని, ముఖ్యంగా పతాక సన్నివేశాలు కట్టి పడేశాయని చెబుతున్నారు. ఫస్టాఫ్‌లో కొన్ని సన్నివేశాల్లో ల్యాగ్ తప్ప.. దాదాపు సినిమా అంతా అలరించేలా ఉందని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ‘హనుమాన్’ బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని నమోదు చేసే అవకాశముంది.

ప్రముఖ సినీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ కూడా ఈ చిత్రంపై పాజిటివ్ రివ్యూ ఇచ్చారు. ఈ సినిమా అద్భుతంగా ఉందని ప్రశంసించారు. ఇతర సెలబ్రిటీల నుంచి కూడా మంచి టాకే వస్తోంది. మరి ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.