HanuMan Trailer: పోలేరమ్మ మీద ఒట్టు.. హనుమాన్ సినిమా హిట్టు

పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌.. అద్భుతమైన విజువల్స్‌తో ట్రైలర్‌ అదిరిపోయింది. కొన్ని విఎఫ్ఎక్స్ షాట్స్ మినహా దర్శకుడు ప్రశాంత్ వర్మ ఓ గ్రాండ్ ట్రీట్ అయితే ఇవ్వబోతున్నట్టుగా ఈ ట్రైలర్ చూశాక అనిపిస్తుంది.

  • Written By:
  • Publish Date - December 19, 2023 / 04:35 PM IST

HanuMan Trailer: తేజ సజ్జా హీరోగా నటించిన తాజా చిత్రం ‘హను-మాన్‌’. ఫస్ట్‌ ఇండియన్‌ ఒరిజినల్‌ సూపర్‌ హీరో మూవీ ఇది. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, మూడు పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు మేకర్స్‌. పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌.. అద్భుతమైన విజువల్స్‌తో ట్రైలర్‌ అదిరిపోయింది.

SALAAR: ఎవడ్రా రీమేక్ అనేది.. ట్రైలర్ చూసారా ఇంతకీ..

క్వాలిటీ విషయంలో ప్రశాంత్‌ వర్మ ఎక్కడా రాజీ పడలేదని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది. కొన్ని విఎఫ్ఎక్స్ షాట్స్ మినహా దర్శకుడు ప్రశాంత్ వర్మ ఓ గ్రాండ్ ట్రీట్ అయితే ఇవ్వబోతున్నట్టుగా ఈ ట్రైలర్ చూశాక అనిపిస్తుంది. మెయిన్‌గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఓ సూపర్ హీరో సినిమాని చూస్తున్న ఫీల్ ఇందులో కనిపిస్తుండగా వాటితో పాటుగా ఈ తరహా చిత్రాలకి కావాల్సిన గ్రాండియర్‌ని కూడా పర్ఫెక్ట్‌గా చూపించాడు. ఇక ఇందులో ఇతిహాసాన్ని మిక్స్ చేసి దానికి ఆధునిక ప్రపంచ సృజనాత్మకని జోడించడం ఆసక్తిగా ఉంది. తన పాత్రలో తేజ సజ్జ పర్ఫెక్ట్‌గా కనిపిస్తుండగా, విలన్‌గా వినయ్ రాయ్ కనిపించబోతున్నాడు.

అలాగే వరల‌క్ష్మి శరత్ కుమార్, సముద్రఖనిలు ప్రత్యేక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇక యాక్షన్ కూడా సినిమాలో ఊహించని లెవెల్లో కనిపిస్తుంది. ఇంకా ట్రైలర్‌లో సినిమాటోగ్రఫీ కానీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కానీ ఖచ్చితంగా సినిమాకి మేజర్ ప్లస్ అయ్యేలా ఉన్నాయి. ఇలా ఓవరాల్‌గా మాత్రం ఈ జనవరి 12న “హనుమాన్”.. మూవీ లవర్స్‌కు గ్రాండ్ ట్రీట్ ఇచ్చేలా ఉందని చెప్పాలి.