HanuMan Trailer: వీరంగం.. విజువల్‌ వండర్‌ ‘హనుమాన్‌’..

ట్రైలర్ విషయానికి వస్తే.. ఫాంటసీ బ్యాక్‌ డ్రాప్‌తో రూపొందిన హనుమాన్ సినిమాలో హనుమంతుడిని ప్రస్తుత ప్రపంచానికి ముడిపెడుతూ డిఫరెంట్‌ కంటెంట్‌తో వస్తోందని టీజర్‌, పోస్టర్స్‌ చూస్తే అర్థమవుతుంది.

  • Written By:
  • Publish Date - December 19, 2023 / 02:06 PM IST

HanuMan Trailer: ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న మోస్ట్ అవెటైడ్ మూవీ ‘హ‌నుమాన్‌’ మూవీ ట్రైలర్ వచ్చేసింది. ఛైల్డ్‌ ఆర్టిస్టుగా కెరీర్‌ స్టార్ట్‌ చేసిన యంగ్‌ హీరో తేజ సజ్జా నటించిన ఈ మూవీపై ఓ రేంజ్‌లో అంచనాలు ఉన్నాయి. సినిమా మొదలైనప్పటి నుంచి ఆదిపురుష్ మూవీని మించి హైప్‌ను క్రియేట్ చేసుకోవడంతో ఈ మూవీ కోసం సినీ లవర్స్ ఈగర్‌గా వెయిట్ చేశారు. దీంతో ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్ ఇస్తూ ట్రైలర్ రిలీజ్ చేసి అంచనాలు పెంచేశారు.

PM MODI: సికింద్రాబాద్ నుంచి మోడీ.. మెదక్ నుంచి సోనియా.. అగ్రనేతలిద్దరూ తెలంగాణ నుంచే పోటీ?

ట్రైలర్ విషయానికి వస్తే.. ఫాంటసీ బ్యాక్‌ డ్రాప్‌తో రూపొందిన హనుమాన్ సినిమాలో హనుమంతుడిని ప్రస్తుత ప్రపంచానికి ముడిపెడుతూ డిఫరెంట్‌ కంటెంట్‌తో వస్తోందని టీజర్‌, పోస్టర్స్‌ చూస్తే అర్థమవుతుంది. తాజాగా 3 నిమిషాల 28 సెకన్ల ‘హనుమాన్‌’ ట్రైలర్‌ను వదలగా సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది. అందమైన లొకేషన్లలో, చక్కని సినిమాటోగ్రఫీ, థ్రిల్‌ చేసే గ్రాఫిక్స్‌, దానికి తగ్గట్టుగా ఉన్న బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో ట్రైలర్‌ ఓ రేంజ్‌లో వచ్చింది. తనకెలాంటి అతీత శక్తులు ఉన్నాయో తెలియని హనుమ తన అక్కతో కలిసి జీవిస్తుంటాడు. మరోపక్క విధ్వంసం సృష్టించి ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవడమే లక్ష్యంగా ఉన్న విలన్‌.. హనుమ గురించి తెలుసుకొని తన మనుషుల్ని అతనిపై దాడికి పంపిస్తాడు. ఆ క్రమంలో అతను సముద్ర గర్భంలోకి వెళ్లిపోతాడు. అప్పుడు అంజనీపుత్రుడు అతన్ని బయటికి తెస్తాడు.

ఆపై తన శక్తులు ఉపయోగించి శత్రు సంహారం చేస్తాడు. ఈ కథ వింటుంటే చిన్నప్లిలలతోపాటు పెద్దవారు కూడా ఎంజాయ్‌ చేసే విధంగా ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ట్రైలర్ చూస్తుంటే విజువల్ వండర్‌గా అనిపిస్తోంది. ప్రస్తుతం వస్తున్న రొటీన్‌ సినిమాలకు భిన్నంగా సరికొత్త ఫాంటసీ ప్రపంచంలోకి తీసుకెళ్లడంలో దర్శకుడు ప్రశాంత్‌ వర్మ సక్సెస్‌ అయ్యాడనే చెప్పాలి. విజువల్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఎంతో రిచ్‌గా ఉండడంతో సినిమాకి మంచి హైప్‌ వచ్చింది. కంటెంట్‌ పరంగా సాధారణంగా అనిపించినా దాన్ని ప్రజెంట్‌ చేసిన విధానం అందర్నీ ఆకట్టుకునేలా ఉంది.

ట్రైలర్‌ చూసిన తర్వాత సంక్రాంతి బరిలో స్టార్‌ హీరోలతో పోటీపడ గల సత్తా ‘హనుమాన్‌’ చిత్రానికి ఉందని అందరూ భావిస్తున్నారు. రెగ్యులర్‌ సినిమాలకు భిన్నంగా ఉండే కథాంశం, ప్రజెంటేషన్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఈ సినిమాకి ప్రధాన ఆకర్ణణలుగా చెప్పొచ్చు. మరి ఈ సంక్రాంతి సీజన్‌ ‘హనుమాన్‌’కి ఎంతవరకు ప్లస్‌ అవుతుందో చూడాలి.