గబ్బర్ సింగ్ సినిమా తర్వాత… పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో సినిమా అంటే ఫ్యాన్స్ లో పునకాలు వస్తున్నాయి. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మొదలై దాదాపుగా రెండేళ్ళు దాటుతుంది. కాని ఇప్పటి వరకు విడుదల కాలేదు. కారణం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటమే. ఆయన ఎప్పుడు షూటింగ్ లో పాల్గొంటారు అనేది తెలియడం లేదు. దాదాపుగా వచ్చే నెల నుంచే పవన్ షూట్ లో పాల్గొనే అవకాశాలు కనపడుతున్నాయి. డిసెంబర్ లో ఈ సినిమా విడుదల చేసేయాలని హరీష్ శంకర్ భావిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ అధికారిగా కనపడుతున్నారు. అందుకే సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ ను పోలీస్ ఆఫీసర్ గా చాలా బాగా చూపించాడు హరీష్ శంకర్. అందుకే ఇప్పుడు ఈ సినిమాపై ఫ్యాన్స్ లో ఆసక్తి పెరిగిపోతుంది. ఇదిలా ఉంచితే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా టైటిల్ ను అసలు ఎందుకు మార్చాం అనే దానిపై దర్శకుడు హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చారు. ముందు ఈ సినిమాకు భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ ను ఖరారు చేసినా తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ చేసారు.
భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ ను పవన్ కు చెప్పిన వెంటనే ఓకే చేసారట. కాని తర్వాత తన ఆలోచన మారిందని… భగత్ సింగ్ అంటే ఒక విస్పోటనం, భవదీయుడు అంటే వినయం, భగత్ సింగ్ దేశం కోసం ప్రాణాలు ఇవ్వడమే కాదు తీయాలి కూడా, అవసరమైతే యుద్ధం చేయాలి అనే ఉద్దేశంతోనే ఉస్తాద్ భగత్ సింగ్ అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు దర్శకుడు వివరించాడు. ముందు ప్రకటించిన టైటిల్ చాలా మందికి కనెక్ట్ కాలేదట. తర్వాత టైటిల్ మార్చి కథలో కూడా కొన్ని మార్పులు చేసాను అని, హీరో పాత్రలో మాత్రం మార్పులు ఏం చేయలేదని చెప్పుకొచ్చాడు.