భారీ అంచనాలతో వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఏ మాత్రం వర్కౌట్ లేకుండా ఏదో సినిమా చేయాలి కాబట్టి చేసినట్టు ఉంది తప్పించి… సరైన షాట్ ఒక్కటి కూడా సినిమాలో లేదనే టాక్ వినపడుతోంది. రవితేజా కూడా కథ విషయంలో వెనకా ముందు చూడకుండా ఏదొకటిలే చేసేద్దాం అన్నట్టు చేసిన సినిమాగానే కనపడుతోంది గాని శ్రద్ధతో చేసిన సినిమాగా మాత్రం కనపడలేదు. ఒక్క హీరోయిన్ అందాలు తప్పించి ఈ సినిమాలో చెప్పుకోవడానికి గొప్పగా ఏమీ లేవు అనే టాక్ వచ్చింది.
హిట్ సినిమాను రీమేక్ చేస్తున్నప్పుడు… అందులో ఉన్న సీన్స్ ని మారుస్తున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కాని అదేం లేదు… మాస్ ఆడియన్స్ కు నచ్చాలి అన్నట్టు రొటీన్ డైలాగులు, రొటీన్ రొట్ట సీన్లు తప్పించి సినిమాలో ఒక్కటంటే ఒక్క సీన్ కూడా గొప్పగా కనపడలేదనే చెప్పాలి. ఇదిలా ఉంచితే ఈ సినిమాలో పాటల్లో డాన్స్ లపై విమర్శలు వస్తున్నాయి. ఒక స్టెప్ పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. హీరోయిన్ చీరలోపలికి హీరో చేయి పెట్టి పట్టుకోవడం విమర్శలకు దారి తీసింది.
ఒకవైపు ప్రజలు ఇలాంటి వాటిని తిడుతున్న సమయంలో అలాంటి స్టెప్ ఎలా అంగీకరిస్తారు అంటూ దర్శకుడిపై విమర్శలు వస్తున్నాయి. సీనియర్ హీరో అయిన రవితేజా కూడా ఆ స్టెప్ కి నో అనకుండా ఎలా చేస్తారని దుమ్మెత్తిపోస్తున్నారు. దీనిపై దర్శకుడు హరీష్ శంకర్ స్పందించారు. సితార్ సాంగ్ లో… ఆ స్టెప్ కూడా అభ్యంతరకరంగా అనిపించింది… కాని ఫస్ట్ డే షూట్ లోనే శేఖర్ మాస్టర్ కు వద్దని చెప్తే బాగోదని వదిలేసా… డాన్స్ చూస్తే ఇబ్బందిగా ఉండదు… కాని స్క్రీన్ షాట్ తీసి భూతద్దంలో చూస్తేనే ఇబ్బందిగా ఉంటుందని అన్నారు.