సీనియర్ హీరోలకు ఒక దశ దాటక వరుస ఫ్లాప్‌లు వస్తే నిలదొక్కుకోవడం కష్టం. ఒకవేళ క్యారెక్టర్ ఆర్టిస్టుగానో విలన్‌గానో మారినా అవకాశాలు పెద్దగా రావు. కానీ సరైన టైమ్‌లో అదృష్టం తలుపు తడితే.. ఒక్కసారిగా భాగ్యరేఖలు మారిపోతాయ్. ఇప్పుడు ఇలాంటి జాక్ పాట్‌నే కొట్టింది డియోల్ ఫ్యామిలీ. 2023లో తమ హవాని కంటిన్యూ చేస్తోంది. బాలీవుడ్‌లో ఖాన్, కపూర్ ఫ్యామిలీస్ గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. బచ్చన్ ఫ్యామిలీపై కూడా కామెంట్స్ వస్తాయి. కానీ డియోల్ ఫ్యామిలీ గురించి గత పదేళ్లుగా చర్చ లేదు. ధర్మేంద్ర తనయులు బాబీ డియోల్, సన్నీ డియోల్.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసినా.. ఏమి మ్యాజిక్ చేయలేదు. కట్ చేస్తే 2023 ఈ ఫ్యామిలీకి బాగా కలిసొచ్చింది. తండ్రి ధర్మేంద్రకి రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీలో మంచి పాత్ర దక్కింది. ఓల్డ్ ఏజ్‌లో భగ్న ప్రేమికుడిగా బిగ్‌స్క్రీన్‌పై తనదైన ప్లేవర్ చూపించాడు ఈ వెటరన్ హీరో. డియోల్ బ్రదర్స్ విషయానికి వస్తే సన్నీ డియోల్‌కు సోలో హీరోగా హిట్ దక్కి దశాబ్దం దాటింది.
Krithi Shetty : కృతిశెట్టి జాతకం మారిపోయింది..
సాధారణ ప్రేక్షకులు కూడా ఆయనను మర్చిపోయారు. ఇలాంటి టైంలో గదర్ 2తో సెన్షేషన్ క్రియేట్ చేశాడు సన్నీ. ఆగస్ట్ 11న రిలీజ్ అయిన గదర్ 2.. బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది. వందల కోట్ల వసూళ్లని రాబట్టింది. దెబ్బతో నిర్మాతలు సన్నీ డియోల్ ఇంటి ముందు క్యూ కట్టారు. ప్రస్తుతం తన చేతిలో అర డజన్ సినిమాలు ఉన్నాయి. త్వరలో అఫిషీయల్‌గా అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తోంది. బాబీ డియోల్ విషయానికి వస్తే.. యానిమల్ తన కెరీర్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది. మాటలు లేకుండా కేవలం హావభావాలతో బాబీ చేసిన విలనిజం.. ఆడియన్స్‌లో బలమైన ముద్ర వేసింది. ముగ్గురు భార్యల అబ్రార్‌గా స్క్రీన్ పై జీవించేశాడు. దెబ్బకు బాబీ డియోల్‌కి అవకాశాలు వెల్లువలా కురుస్తున్నాయి. యానిమల్‌కి 4 కోట్లు మాత్రమే ఛార్జ్ చేసిన బాబీకి.. ఇప్పుడు పది కోట్లయినా ఇచ్చేందుకు ప్రొడ్యూసర్లు సిద్ధంగా ఉన్నారు. మొత్తానికి ఖాన్లు, కపూర్ల ఆధిపత్యంలో డియోల్ ఫ్యామిలీ తిరిగి కమ్ బ్యాక్ అవ్వడం ఫ్యాన్స్‌ను ఖుషి చేసే మ్యాటర్‌గా మారింది.