ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టుతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా షేక్ అవుతున్నారు జనాలు. నిన్న మధ్యాహ్నం నుంచి దాదాపుగా మీడియాలో మొత్తం ఇవే వార్తలు రన్ అవుతున్నాయి. చిక్కడపల్లి పోలీసులు అసలు అల్లు అర్జున్ అరెస్టు చేస్తారని కలలో కూడా ఎవరు ఊహించలేదు. ఈ కేసులో ఏ11 గా ఉన్న అల్లు అర్జున్ ను అరెస్టు చేసే అవకాశాలు లేవని చాలామంది అభిప్రాయపడ్డారు. కానీ అప్పటికే 10 మందిని అరెస్టు చేసిన పోలీసులు 11వ వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకుని సంచలనం సృష్టించారు.
జాతీయ మీడియా కూడా ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున ఫోకస్ చేసింది. ఇక పోలీసులు తీరుపై ప్రతి ఒక్కరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసే పరిస్థితి కూడా నెలకొంది. అల్లు అర్జున్ ని కనీసం బట్టలు వేసుకొనీయకుండా బెడ్ రూమ్ వరకు వెళ్లి అరెస్టు చేయాల్సిన అవసరం ఏముంది అని అతను ఏమీ పారిపోవడం లేదు కదా అంటూ సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. ఇక అభిమానులైతే ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ గా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
అల్లు అర్జున్ కు సోషల్ మీడియా నుంచి పెద్ద ఎత్తున మద్దతు వస్తుంది. అయితే ఇంతకీ అల్లు అర్జున్ అరెస్టు చేసిన అధికారి ఎవరు అంటూ సోషల్ మీడియాలో చాలామంది వెతికేస్తున్నారు. అయితే అల్లు అర్జున్ అరెస్టు చేసింది ఒక సీఐ. ఆయన పేరు బానోత్ రాజు నాయక్. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే బన్నీకి రాజు నాయక్ చాలా పెద్ద అభిమాని. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆయన… ఏడాది క్రితమే హైదరాబాద్ కు బదిలీ అయ్యారు. అల్లు అర్జున్ తో ఒక్కసారైనా ఫోటో దిగాలని ఆయన కలలు కనేవారు.
కానీ చివరికి తన అభిమాన నటుడ్ని అరెస్టు చేసే రోజు వస్తుందని ఆయన ఊహించలేదట. ఇక చంచల్ గూడ జైలు నుంచి శనివారం ఉదయం అల్లు అర్జున్ విడుదలయ్యాడు. నిన్న సాయంత్రం మభ్యంతర బెయిల్ ను హైకోర్టు నాలుగు వారాలపాటు మంజూరు చేసింది. అయితే బెయిల్ పేపర్స్ జైలు అధికారులకు చేరకపోవడంతో ఆలస్యమైంది. దీనితో రాత్రంతా అల్లు అర్జున్ జైల్లోనే గడపాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు ఉదయం 6 గంటల తర్వాత అల్లు అర్జున్ ను జైలు అధికారులు విడుదల చేశారు. అక్కడి నుంచి నేరుగా గీత ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకుని ఆ తర్వాత జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి వెళ్ళాడు అల్లు అర్జున్.