Chiru : ఆ ఎక్స్‌పీరియ‌న్స్ మ‌రువ‌లేనంటూ ట్వీట్..

మెగాస్టార్ (Megastar) చిరంజీవి (Chiranjeevi) హీరోగా త్రిష హీరోయిన్ గా తెర‌కెక్కుతున్న మూవీ విశ్వంభ‌ర‌ (Vishwambhara).. సోషియో ఫాంట‌సీ క‌థాంశంతో.. పాన్ ఇండియా (Pan India) లెవ‌ల్‌లో తెర‌కెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచ‌నాలున్నాయి.

మెగాస్టార్ (Megastar) చిరంజీవి (Chiranjeevi) హీరోగా త్రిష హీరోయిన్ గా తెర‌కెక్కుతున్న మూవీ విశ్వంభ‌ర‌ (Vishwambhara).. సోషియో ఫాంట‌సీ క‌థాంశంతో.. పాన్ ఇండియా (Pan India) లెవ‌ల్‌లో తెర‌కెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచ‌నాలున్నాయి. భీమ‌వ‌రం దొర‌బాబుగా చిరు నుంచి మ‌రో ఎన‌ర్జ‌టిక్ పెర్ఫార్మెన్స్ కోసం మెగా ఫ్యాన్స్‌తో పాటు కామ‌న్ ఆడియ‌న్స్ కూడా ఎంతో ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. పంచభూతాలు, అనంత విశ్వం, మూడు లోకాలు ఇలా ఎంతో ఎగ్జయిటింగ్ కలిగించే కాన్సెప్ట్‌తో విశ్వంభరను వశిష్ట ప్లాన్ చేశాడని పోస్టర్‌లను చూస్తే అర్థం అవుతోంది. ఇక‌.. ఈ మూవీకి సంబంధించిన అప్‌డేట్స్ ఇటీవ‌ల కాలంలో విప‌రీత‌మైన బ‌జ్‌ను క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ మూవీలో డ్యాన్స్ మాస్ట‌ర్‌కు సంబంధించిన మ‌రో లేటెస్ట్ అప్‌డేట్ సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది.

చిరంజీవి అంటేనే డ్యాన్స్‌కు పెట్టింది పేరు.. కేవ‌లం ఆయ‌న డ్యాన్స్‌కు, స్టెప్పుల‌కే కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక‌.. ఇండస్ట్రీలోకి వ‌చ్చిన ప్ర‌తి డ్యాన్స్ మాస్ట‌ర్ ఆయ‌న‌కు డ్యాన్స్ కంపోజ్ చేయ‌డాన్ని ఓ బిగ్ డ్రీమ్‌గా పెట్టుకుంటారు. ఇక‌.. విశ్వంభర మూవీ కోసం కీరవాణి అద్భుతమైన పాటల్ని రికార్డ్ చేసినట్టనిపిస్తోంది. ఇక ఈ పాటలకు వశిష్ట ఎంచుకుంటున్న కొరియోగ్రఫర్లను చూస్తేనే సాంగ్స్‌ను ఏ విధంగా డిజైన్ చేశాడో అర్థం అవుతోంది. ఇప్ప‌టికే విజయ్ బిన్నీతో ఓ సాంగ్ పూర్తి చేశారట. ప్రస్తుతం శోభి మాస్టర్‌తోనూ మరో సాంగ్‌ను కంప్లీట్ చేశార‌ని తెలుస్తోంది. విశ్వంభర మూవీలో తాను వర్క్ చేస్తున్నానని, మెగాస్టార్ తో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ ఎప్పటికీ మరువలేను అంటూ శోభి మాస్టర్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైర‌ల్‌గా మారిది.

ఈ మ‌ధ్య కాలంలో చిరంజీవి పాట‌లు అంటే.. శేఖర్ మాస్టర్ (Shekhar Master) మాత్రమే కంపోజ్ చేస్తున్నాడు.. అయితే చిరుతో అవే రొటీన్ స్టెప్పులు వేయిస్తూ విసిగిస్తున్నాడంటూ ఫ్యాన్స్ నుంచి కంప్ల‌యింట్స్ వ‌స్తున్నాయి. అందుకే ఈ సారి శేఖర్ మాస్టర్‌కు అన్ని పాటలను అప్పగించలేదని తెలుస్తోంది. అంతేకాదు. ఇప్ప‌టి వ‌ర‌కు శేఖ‌ర్ మాస్ట‌ర్‌కు విశ్వంభ‌ర టీమ్ నుంచి పిలుపు కూడా రాలేద‌ట‌. అయితే.. జానీ మాస్ట‌ర్‌తో (Johnny Master) ఓ పాట కంపోజ్ చేయించ‌మంటూ రిక్వెస్ట్‌లు మాత్రం వెల్లువెత్తుతున్నాయి. మ‌రి వ‌శిష్ట ఎలాంటి డెసిష‌న్ తీసుకుంటాడో ఇంకా తెలియ‌దు. చూడాలి మ‌రి.. ఇన్ని జాగ్ర‌త్త‌ల మ‌ధ్య, ఎన్నో అంచ‌నాల మ‌ధ్య తెర‌కెక్కుతున్న విశ్వంభ‌ర మెగాస్టార్‌కు ఎలాంటి రిజ‌ల్ట్‌ను అందిస్తుందో..