Hero Akhil: అఖిల్‌ అయ్యగారి పని అయిపోయిందా ? హిట్‌ ట్రాక్‌లోకి రావడం అసాధ్యమేనా ?

ఓ తరాన్ని తాత ఏలాడు.. తండ్రి తర్వాత తరాన్ని ఊపేశాడు. ఆరంభంలో తడబడ్డా.. అన్న ఎలాగోలా సెట్ అయ్యాడు. ఇప్పుడు అఖిల్‌ పరిస్థితి ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. ముట్టుకుంటే మట్టి.. పట్టుకుంటే నాశనం అన్నట్లు ఉన్నాయి అయ్యగారి సినిమాలు. అఖిల్‌తో భారీ ఎంట్రీ ఇచ్చాడు అట్టర్‌ఫ్లాప్ అయింది. ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్‌ సోసో అనిపించింది అంతే.. అది కూడా ఆ సినిమాలో కలరింగ్‌తోనే ! ఇప్పుడు ఏజెంట్‌ మళ్లీ డబేల్‌మంది.

  • Written By:
  • Publish Date - April 29, 2023 / 05:30 PM IST

దీంతో చెప్పుకోవడానికి ఒక్క గట్టి హిట్‌ కూడా లేదు.. అఖిల్‌ కెరీర్‌లో ! అక్కినేని కుటుంబం అనుకుంటే టాలీవుడ్‌లో జరగందంటూ ఏదీ లేదు. ఒకరకంగా ఇండస్ట్రీని శాసిస్తోందా ఫ్యామిలీ. తాత నాగేశ్వరరావు, తండ్రి నాగార్జున లెగసీని నిలబెట్టాల్సిన బాధ్యత చైతన్య, అఖిల్ మీద ఉంది. జోష్ అంటూ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి బొక్కాబోర్లా పడిన చైతన్య.. ఐతే తన మార్క్ సినిమాలు ఏంటో, తన మార్కెట్‌ ఏంటో తెలుసుకొని సినిమాలు చేస్తున్నాడు.. హిట్‌లు కొడుతున్నాడు. అఖిల్‌ పరిస్థితే అంతా ఆగమాగం అయింది. యాక్షన్‌ హీరోగా నిలబెట్టే ప్రాసెస్‌లో.. మిగిలిన 8రసాలు కూడా వెక్కిరిస్తున్నాయ్ అయ్యగారిని పాపం! క్రికెటర్‌గా మంచి పేరు ఉన్న అఖిల్.. అనవసరంగా ఆ పేరు కూడా చెడగొట్టుకుంటున్నాడేమో అనిపిస్తుందనే జోకులు కూడా ఉన్నాయి.

అఖిల్ సినిమా అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్‌కు.. ఆ మూవీ భారీ షాక్ ఇచ్చింది. తర్వాత హలో అంటే.. కనీసం రెస్పాన్స్‌ లేదు అవతలి నుంచి. ఫ్యామిలీకి అచ్చొచ్చిన ప్లేబాయ్ కేరక్టర్‌తో అయినా హిట్‌ కొడదాం అనుకుంటే.. మిస్టర్ మజ్ను కూడా బొక్కాబోర్లాపడింది. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్‌ కాస్త పర్వాలేదనిపించింది. ఇప్పుడు అఖిల్ మళ్లీ డుమ్‌కీ కొట్టింది. దీంతో బ్యాక్‌ టు పెవిలియన్ అనేశాడు అఖిల్. రెండేళ్ల కష్టం.. సిక్స్‌ప్యాక్‌ బాడీ.. అంతా వేస్ట్ అయిపోయింది పాపం.

అఖిల్ ఫెయిల్యూర్‌కు రకరకాల కారణాలు కనిపిస్తున్నాయ్. స్టోరీ ఎంపికలో జడ్జిమెంట్ లేకపోవడం.. ఏది తనకు నప్పుతుందో డిసైడ్ చేసుకోలేకపోవడం.. ప్యాన్ ఇండియా అంటూ కంగారు పడిపోయి మొదటికే మోసం తెచ్చుకోవడం.. డైరెక్టర్స్ సెలక్షన్‌లో లోపాలు.. ఫ్యామిలీ ఇమేజ్‌కు భిన్నంగా స్టోరీలు సెలక్ట్‌ చేసుకోవడం.. రాత్రికి రాత్రి స్టార్ అయిపోవాలనే కోరిక.. ఇలా చెప్పుకుంటూ పోతే అఖిల్‌ ఫెయిల్యూర్స్‌కు చాలా రీజన్స్‌ కనిపిస్తున్నాయ్. తనకు ఏ పాత్ర కరెక్టో.. ఏ పాత్రకు తను కరెక్టో సరిగ్గా డిసైడ్ చేసుకున్న రోజు.. అఖిల్‌ను సక్సెస్‌ ఫాలో అయ్యేచాన్స్ ఉంది. నాగచైతన్య చేసింది అదే ! మాస్‌ అంటూ కొన్ని ట్రై చేశాడు. రివర్స్ అయ్యేసరికి.. మళ్లీ తనకు నప్పే రొమాంటిక్ జోనర్‌నే ఎంచుకున్నాడు. ఇప్పుడు అఖిల్ చేయాల్సింది కూడా అదే. రాత్రికి రాత్రి ఆకాశానికి మేడలు కట్టే ప్రయత్నం ఆపేసి.. తనకు, తన ఫ్యామిలీకి సూట్ అయ్యే కేరక్టర్స్ చేయాలి. లేదంటే అయ్యగారికి ఇలాంటి దెబ్బలు తప్పవు మరి !