Hero Nani: బాక్సాఫీస్‌ బద్దలు బాసింగాల్ చేస్తున్న దసరా.. ఎన్టీఆర్‌ రికార్డులు కూడా బ్రేక్‌..

ఇప్పుడేం నడుస్తుందంటే.. ఇంకేం నడుస్తుంది దసరానే ! పండగ కాదు.. యుఫోరియా ! ఎండాకాలంలో దసరాతో వచ్చిన హీరో నాని.. బాక్సాఫీస్‌ దగ్గర పండగ వాతావరణం క్రియేట్ చేశాడు. అద్భుతమైన రెస్పాన్స్‌తో వాల్డ్‌వైడ్‌గా దసరా మూవీ దూసుకుపోతోంది.

  • Written By:
  • Publish Date - April 2, 2023 / 04:30 PM IST

ఫస్ట్ షోతోనే పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా.. బాక్సాఫీస్ బద్దలు బాసింగాల్ చేస్తోంది. కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. మార్చి 30న వాల్డ్‌వైడ్‌గా ఈ మూవీ రిలీజ్ అయింది. ఓ రేంజ్ రెస్పాన్స్‌తో థియేటర్లలో దూసుకుపోతోంది. క్లాస్, మాస్ ఆడియన్స్ అంతా.. కథకు ఫిదా అయిపోతున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో భారీ వసూళ్లు రాబడుతోందీ మూవీ. యూఎస్‌లోనూ హవా నడిపిస్తోంది.

రూరల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా అక్కడి ఆడియన్స్‌ని హుషారెత్తిస్తోంది. దీంతో నాని ఖాతాలో మరో అరుదైన రికార్డ్ నమోదైంది. ఇప్పటికే యూఎస్‌లో 1 మిలియన్ డాలర్ మార్క్ క్రాస్ చేసింది దసరా. ప్రీమియర్స్‌తోనే హాఫ్ మిలియన్ డాలర్స్‌కు పైగా రాబట్టిన ఈ సినిమా.. అదే జోష్ కంటిన్యూ చేస్తోంది. దసరా కలెక్షన్స్ 1 మిలియన్‌ దాటేయడంతో.. మహేష్ బాబు తప్ప మిగితా స్టార్ హీరోల రికార్డ్స్ కొల్లగొట్టేశారు నాని. యూఎస్‌లో 8 మిలియన్ డాలర్ల సినిమాలు ఉన్న హీరోగా నాని సరికొత్త రికార్డు క్రియేట్ చేసాడు.

11 మిలియన్ డాలర్ మూవీస్‌తో మహేష్ బాబు.. మిలియన్‌ డాలర్ క్లబ్‌లో తొలిస్థానంలో ఉండగా.. ఆ తర్వాతి స్థానంలో నాని నిలిచాడు. 7 సినిమాలతో ఎన్టీఆర్ మూడో స్థానంలో ఉన్నాడు. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కూడా దసరా ఊచకోత నడుస్తోంది. ప్రతీ చోట మంచి వసూళ్లనే సాధిస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమాపై పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. పక్కా తెలంగాణ యాసతో వచ్చిన ఈ సినిమా వరల్డ్ వైడ్ సునామీ సృష్టిస్తోంది.