టాలీవుడ్ యంగ్ హీరో నితిన్‌కు గాయాలయ్యాయి.. తమ్ముడు టైటిల్‌తో చేస్తున్నసినిమా షూటింగ్లో నితిన్‌కు గాయాలయ్యాయి.. గాయపడిన నితిన్‌ను ముందుగా రాజమండ్రిలోని ఓ ఆస్పత్రికి తరలించారట. అక్కడ ప్రథమ చికిత్సను చేసిన తర్వాత హైదరాబాద్ తరలించారని అంటున్నారు. ఈ ప్రమాదంలో నితిన్‌కు చాలా చోట్లా గాయాలు అయ్యాయని.. డాక్టర్లు మూడు వారాలు విశ్రాంతి సూచించారని టాక్ వినిపిస్తోంది. అయితే, దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నితిన్ సన్నిహితులు చెప్తున్నారు.
వేణు శ్రీరామ్ – నితిన్ కాంబినేషన్లో రూపొందుతోన్న తమ్ముడు మూవీ షూటింగ్ కొద్ది రోజుల క్రితమే ప్రారంభమైంది. అప్పటి నుంచి దీనికి ఏమాత్రం బ్రేకులు లేకుండా చిత్రీకరణ జరుపుతూనే ఉన్నారు. ఇందులో హీరో నితిన్‌తో పాటు చాలా మంది ప్రముఖులు భాగం అవుతున్నారు. త్వరలోనే దీన్ని పూర్తి చేసేలా ప్లాన్లు చేసుకుంటున్నారు.. అందులో భాగంగానే.. మారేడుమిల్లిలోని అటవీ ప్రాంతంలో నితిన్ ప్రజంట్ మూవీ తమ్ముడు మూవీ షూటింగ్ జరుగుతోంది. ఈషూటింగ్ లో భారీ యాక్షన్ సీన్స్ ను చిత్రీకరిస్తుండగా.. నితిన్ చేతికి పెద్ద గాయం అయినట్టు తెలుస్తోంది. దాంతో షూటింగ్ ను నిలిపివేశారట.
నితిన్ చాలా కాలంగా సరైన హిట్లు లేక ఇబ్బంది పడుతున్నాయి. గత ఏడాది చేసిన ఒక్క సినిమా కూడా సరైన హిట్ ను ఇవ్వలేదు.. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎక్స్ట్రా మూవీ కూడా నితిన్‌కు నిరాశనే మిగిల్చింది. అందుకే.. ఈసారి తనకెంతో ఇష్టమైన పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ మూవీ తమ్ముడి టైటిల్‌తోనే సినిమా చేయాలని ఫిక్సయ్యాడు.. అక్కా, తమ్ముడు అనుబంధం నేపధ్యంలో వస్తున్న ఈ మూవీపై నితిన్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పుడు నితిన్‌కు గాయాలవడంతో సినిమాకు షూటింగ్ బ్రేక్ పడడంతో.. మూవీ టీమ్‌తో పాటు, నితిన్ ఫ్యాన్స్ కూడా డిజప్పాయింట్ అవుతున్నారు.