ఫ్యాన్స్ కోసమే ఈ సినిమా.. ఫ్యాన్స్ కోసమే ఈ మార్పులు అంటూ.. రిలీజ్ లేట్ అయినా.. ఖర్చు ఎక్కువ అయినా తగ్గేదే లే అంటోంది మూవీ టీమ్. రికార్డులు బ్రేక్ చేయడం కాదు.. కొత్త రికార్డులు క్రియేట్ చేయబోతున్నాడు ప్రభాస్ అని మురిసిపోతున్నారు ఫ్యాన్స్ అంతా ! మరో రెండు రోజుల్లో రాఘవుడి రూపం.. రాముడి కథ కళ్ల ముందు చిత్రరూపంగా మారబోతోంది. దేశంలోని ప్రధాన పట్టణాల్లో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ ఓపెన్ అయింది.
దీంతో అన్నిచోట్లా ఈ మూవీకి మంచి ఆదరణ లభిస్తోంది. ఆదిపురుష్ మూవీ హిందీ వర్షన్‌కు ఇప్పటికే 3లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయ్. రిలీజ్ నాటికి ఇది 4 లక్షలకు చేరే చాన్స్ ఉంది. అదే జరిగితే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఎక్కువ టికెట్లు అమ్ముడైన చిత్రాల్లో ఈ మూవీ నాలుగో స్థానానికి చేరుతుంది. ఈ లిస్టులో బాహుబలి 2, పఠాన్, కేజీఎఫ్ 2 ముందు వరుసలో ఉన్నాయ్. అడ్వాన్స్ బుకింగ్‌కు మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వస్తుండడంతో.. ఈ మూవీకి ఓపెనింగ్స్ భారీగా వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.
ఒకవేళ ఈ చిత్రానికి నాలుగు లక్షల టికెట్లు అమ్ముడయితే.. మొదటి రోజు 25 నుంచి 30 కోట్లు రావొచ్చని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ టాక్ బాగుండి.. ఆఫ్‌లైన్ ్టికెట్లు కూడా అమ్ముడయితే.. 40 కోట్లు వరకూ రావొచ్చని చెప్తున్నారు. ఒకవేళ ఆదిపురుష్ మూవీకి మొదటి రోజే హిందీలో 40 కోట్లు వసూలు అయితే.. సౌత్ హీరోల జాబితాలో ఈ చిత్రం మూడో స్థానానికి చేరుతుంది. అలాగే హిందీలోనూ మంచి స్థానం అందుకుంటుంది. ఫస్ట్ డే ఎక్కువ కలెక్ట్ చేసిన సౌత్ మూవీస్‌లో.. కేజీఎఫ్ చాప్టర్ 2 మొదటి స్థానంలో ఉండగా.. బాహుబలి 2 రెండో స్థానంలో కొనసాగుతోంది. వీటి తర్వాత ఆదిపురుష్ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.