Tarun: నిహారికతో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన తరుణ్..

నిహారిక, తరుణ్‌ పెళ్లి అంటూ మూడు రోజులుగా సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా ఇంతా కాదు. ఈ మధ్యే చైతన్యతో నిహారిక విడాకులు తీసుకుంది. తరుణ్‌ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్. దీంతో మెగాస్టార్ ఇంటికి తరుణ్ అల్లుడు కాబోతున్నాడని సోషల్‌ మీడియా కోడై కూసింది.

  • Written By:
  • Publish Date - August 2, 2023 / 03:34 PM IST

టాలీవుడ్ హ్యాండ్‌సమ్‌ హీరోగా తరుణ్‌.. ఓ ఊపు ఊపాడు ఆ మధ్య ! ఆర్తి అగర్వాల్‌తో లవ్‌ ట్రాక్ నడిచినా.. పెళ్లి పీటల వరకు వెళ్లలేదు అది ఎందుకో ! ఐతే ఇప్పుడు 4పదుల వయసు వచ్చినా.. తరుణ్‌ ఇప్పటికి కూడా పెళ్లి ఊసు ఎత్తడం లేదు. త‌రుణ్ పెళ్లి కోసం ఆయ‌న ఫ్యాన్స్‌.. ప‌దేళ్ల నుంచి ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. తరుమ్‌ తల్లి రోజారమణి ఎప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చినా.. ముందు తరుణ్‌ పెళ్లి గురించే ప్రశ్న వినిపించేది. ఈ మధ్యే ఓ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె.. ఇండస్ట్రీకి చెందిన పెద్ద కుటుంబానికి చెందిన అమ్మాయిని తరుణ్‌ పెళ్లి చేసుకోబోతున్నాడు అన్నట్లుగా హింట్ ఇచ్చారు. ఇండస్ట్రీలో పెద్ద కుటుంబం అంటే మెగా ఫ్యామిలీనే కాబట్టి.. నిహారికతో తరుణ్‌ పెళ్లి అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం అందుకుంది.

రెండు రోజులుగా త‌రుణ్ పెళ్లికి సంబంధించి ఈ న్యూస్ వైరల్‌గా మారింది. త‌రుణ్ త్వర‌లోనే మెగా ఇంటికి అల్లుడు కాబోతున్నాడ‌ని.. చైత‌న్య జొన్నల‌గ‌డ్డకు విడాకులు ఇచ్చేసిన మెగా డాట‌ర్ నిహారిక‌ను పెళ్లాడ‌బోతున్నాడ‌ని ప్రచారం జ‌రుగుతోంది. దీనిపై తరుణ్‌ స్వయంగా క్లారిటీ ఇచ్చాడు. తన పెళ్లి గురించి వస్తున్న వార్త నిజం కాదని క్లియర్‌కట్‌గా చెప్పేశాడు. ఏదైనా గుడ్‌న్యూస్ ఉంటే నిరభ్యంతరంగా సోషల్ మీడియా వేదికగా లేదా మీడియా ముఖంగా చెప్తానని.. తన పెళ్లి విషయంలో ఇలాంటి పుకార్లు క్రియేట్‌ చేయొద్దని విజ్ఞప్తి చేశాడు. దీంతో నిహారిక‌తో త‌రుణ్ పెళ్లి అన్న వార్త పుకారే అని తేలిపోయింది. చైల్ట్ ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ చేసి.. ఆ త‌ర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చాడు త‌రుణ్‌. త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్డమ్ సొంతం చేసుకున్నాడు. త్వరగా ఫేడౌట్ హీరోల జాబితాలో చేరాడు.