Hero Wife: ఉదయ్‌ కిరణ్‌ భార్య ఇప్పుడు ఎంత మారిపోయిందో ?

ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా సినీ ఇండస్ట్రీకి వచ్చి స్టార్‌ హీరోస్‌తో సమానమైన క్రేజ్‌ దక్కించుకున్న హీరో ఉదయ్‌ కిరణ్‌. అప్పట్లో టాలీవుడ్‌కు ఈయన లవర్‌బాయ్‌. వరుస హిట్స్‌తో కెరీర్‌లో దూసుకుపోతున్న ఉదయ్‌కు ఊహించనివిధంగా వరుస అపజయాలు ఎదురయ్యాయి.

  • Written By:
  • Publish Date - March 25, 2023 / 07:00 PM IST

సినిమాల్లోనే కాదు పర్సనల్‌ లైఫ్‌లో కూడా చాలా ఫెయిల్యూర్స్‌ చూశారు ఉదయ్‌ కిరణ్‌. చిరంజీవి కూతురితో ఎంగేజ్‌మెంట్‌ క్యాన్సిల్‌ అవడం, తరువాత కెరీర్‌లో వరుస ఫ్లాప్స్‌ రావడంతో డెప్రెషన్‌లోకి వెళ్లిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఉదయ్‌ కిరణ్‌ చనిపోయిన తరువాత ఆయణ భార్య విషిత ఏమయ్యారు ? ఎక్కడున్నారు ? ఆమె రెండో పెళ్లి చేసుకున్నారా ? ఇప్పుడు ఇదే డిస్కర్షన్‌ ఇంటర్నెట్‌లో నడుస్తోంది. అయితే అంతా అనుకున్నట్టు విషిత రెండో పెళ్లి చేసుకోలేదు. భర్త జ్ఞాపకాల్లోనే గడుపుతూ జీవిస్తోంది.

ప్రస్తుతం తన పేరెంట్స్‌తో ఉంటున్న విషిత ఓ ఎంఎన్‌సీ కంపెనీలో సాఫ్ట్ వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్నారట. ఆమె ఎక్కడ ఉంటున్నారు. ఎక్కడ జాబ్‌ చేస్తున్నారు అనే విషయాలు బయటికి రాకపోయినా.. తన ఫ్యామిలీ మెంబర్స్‌తో ఉన్న కొన్ని ఫొటోలు మాత్రం ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. ఎప్పుడూ మీడియాకు దూరంగా ఉండే విషిత ఉదయ్‌ కిరణ్‌ పుట్టిన రోజు, వర్ధంతి రోజు మాత్రం తప్పకుండా దానధర్మాలు చేస్తారట. గుళ్లలో అన్నదానాలు నిర్వహిస్తారట. ఇన్నేళ్లు గడిచినా ఇంకా విషితకు భర్తపై ఉన్న ప్రేమ చూసి అంతా ఫిదా అవుతున్నారు.