పాన్ ఇండియా రేంజ్ లో బాలీవుడ్ ఏ మూవీ తీయాలన్నా, సౌత్ నుంచి ఓ హీరోయిన్ కావాలి.. అది రష్మికనే అవ్వాలి.. మరోకరైతే ఓకే నా అంటే నోఛాన్స్ అంటున్నారు బాలీవుడ్ దర్శక నిర్మాతలు.. అక్కడే ఒకే ఒక్క లాజిక్ రష్మికకు కలిసొస్తోంది.
హిందీ మూవీలో సౌత్ హీరోయిన్ ఉంటే, పాన్ఇండియా లెవల్లో అంటే సౌత్ లో కూడా సినిమాకు రీచ్ పెరుగుతుంది. మంచి ఆలోచనే అందుకు చాలా మంది సౌత్ హీరోయిన్లు ఉండగ రష్మికనే ఎందుకు తీసుకుంటున్నారనే ప్రశ్న ఎదురౌతోంది. విషయం ఏంటంటే, పూజా హెగ్డేని హిందీ పాన్ ఇండియా మూవీలకు తీసుకోవచ్చు కదా అంటే, తనకి ఐరన్ లెగ్ గా అక్కడ కూడా పేరొచ్చింది. ఫస్ట్ హిందీ మూవీ మెహేంజోదారో, హౌజ్ ఫుల్ సీక్వెల్, మొన్నొచ్చిన కిసీకా భాయ్ కిసీకా జాన్ అన్నీ ఫ్లాపులే కావటంతో, తనని లెక్కలోకి తీసుకోవట్లేదు. సమంత వెబ్ సీరీస్ లకే సరిపోతోందని ఫిక్స్ అయ్యారు. పెద్ద హీరోలు జోడీ కట్టెందుకు ఆసక్తి చూపట్లేదు. ప్లస్ తన ఆరోగ్యపరిస్తితి బాలేదు.
ఇక శ్రీ లీలా, క్రుతి శెట్టి, కీర్తిసురేష్ ఉన్నా వాళ్లిక నార్త్ ఆడియన్స్ లో పెద్దగా పరిచయంలేదు. ఎలా చూసినా పుష్ప తో ఫోకస్ అయిన రష్మికనే కరెక్ట్ అనుకుంటున్నారు. హిందీలో గుడ్ బై, మిషన్ మజ్నుతో అక్కడ కూడా ఈజీగా నెట్టుకురాగలనని ప్రూవ్ చేసుకుంది రష్మిక. అందుకే యానిమల్ లో తీసుకున్నారు. ఇప్పుడు రణ్ వీర్ సింగ్ తో శంకర్ తీసే మూవీలో తననే తీసుకుంటున్నారు. ఆ కారణం తోనే బాలీవుడ్ లో తెరకెక్కే మూవీల్లో బంపరాఫర్లు రష్మికకి వెలుతున్నాయని తెలుస్తోంది.