సమంత (samantha) ఈ పేరు తో తెలుగు ప్రజలకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. 2010లో ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది ఈ అంద్ధాల తార. బృందావనం సినిమాతో తెలుగు కుటింబికులకు ఎంతో దగ్గరయ్యింది సమంత. బిగినింగ్ లోనే ఎన్టీఆర్, మహేష్ వంటి స్టార్స్ పక్కన ఛాన్స్ కొట్టేసింది. 13 ఏళ్లకు పైగా సాగుతున్న కెరీర్లో సమంత వెనక్కి తిరిగి చూసుకుంది లేదు. అలా తన సినీ జీవితంలో ఎన్నో విజయాలు అందుకుంటూ తెలుగు ప్రజల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పారుచుకుంది. తన ఫస్ట్ మూవీ హీరో నాగచైతన్య (nagachaitanya) సమంత ప్రేమ వివాహం చేసుకుంది ఈ ముద్దు గుమ్మ. 2018లో గోవా వేదికగా సమంత – నాగ చైతన్యల వివాహం చేసుకున్నారు. టాలీవుడ్ వీరికి లవ్లీ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు. తర్వాత కొన్ని వ్యక్తిగత కారణాలతో సమంత-చైతన్య అనూహ్యంగా విడిపోయారు. 2021 అక్టోబర్ లో సమంత-చైతూ అధికారికంగా విడాకుల ప్రకటన చేశారు.
Varun Tej-Lavanya Reception : ఘనంగా వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి రిసెప్షన్..హాజరైన ప్రముఖులు
ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటారు.. అక్కడికే వస్తున్నా.. నిజ జీవితంలో ఎన్నో విజయాలు పొంది. ప్రేమ పెళ్లి చేసుకొని.. విడిపోయి. ఉన్న సమంతకు ఆ వ్యాధి సోకిన విషయం ఇండస్టీ మొత్తానికి తెలుసు. ఆ వ్యాధికి ఏ చికిత్స చేస్తారో తెలుసా మీకు.. అయితే ఇప్పుడు తెలుసుకోండి.
సమంత కొన్నాళ్లు గా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆమెకు గత సంవత్సరం మయోసైటిస్ (myositis) సోకింది. ఈ వ్యాధికి సుదీర్ఘ కాలంగా చికిత్స తీసుకుంటున్న సమంత. దీనిలో భాగంగా మాయోసైటిస్ కు చికిత్సగా క్రయోథెరఫీ చేయించుకున్నారు. ఈ వ్యాధి వల్ల త్వరగా అలసట రావడం.. కండరాల వాపు.. నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ విషయాన్ని సమంత ఏడాది దాచి చివరికి 2022 అక్టోబర్ లో సమంత తన అనారోగ్య సమస్య బయటపెట్టింది. ఈ వ్యాధిపై సమంత ఇలా చెప్పుకొచ్చింది. “ఇది ప్రాణాంతకం కాదు.. నేను వెంటనే చనిపోవడం లేదు.. అలా అని చిన్న సమస్య కూడా కాదు. నేను ఈ వ్యాధితో పోరాటం చేయాల్సి ఉందని సమంత అన్నారు.” ఈ వ్యాధితో కొన్నాళ్ళు ఇంటికే పరిమితమై చికిత్స తీసుకుంది సమంత.
క్రయోథెరపీ అంటే ఏమిటి..?
తాజాగా ఆమె వ్యాధికి కఠినమైన చికిత్స ప్రారంభమైనట్లు వెల్లడైంది. క్రయోథెరపీ అంటే గడ్డకట్టించే చల్లని నీళ్లతో శరీరాన్ని తడపాలి. మంచు ముక్కల మధ్య కొన్ని నిమిషాలు కూర్చోవాలి. అత్యంత కోల్డ్ వాటర్ ఉన్న టబ్ లో గొంతు మునిగి కొన్ని నిమిషాల పాటు ఉండాలి. శరీరాన్ని అత్యంత చల్లని నీటిలో ఉంచడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. అలాగే కొన్ని సమస్యలు ఇది ట్రీట్మెంట్ అని కూడా డాక్టర్లు చెప్తున్నారు.
Star Heroine Samantha : నా మైండ్‌లో అల్లు అర్జున్ ఉన్నాడు.. బాంబు పేల్చిన సమంత..
మయోసైటిస్ వ్యాధి వలన.. కండరాల నొప్పి, రక్తనాళాలు వాపు, కంటి దెబ్బతినడం, చూపు మందగించడం.. కంటిలోని రెటీనా లో దెబ్బతినడం.. వంటి సమస్యలు ఏర్పడతాయి. ఈ వ్యాధికి ఇంజెక్షన్ల, టాబ్లెట్స్ తో ఎక్కువ పని చేయలేవు అంట.. క్రయోథెరపీ కండరాల నొప్పి, వాపు తగ్గిస్తుందట. అలాగే అసహజమైన, అనారోగ్య పూరితమైన కణజాలంను నాశనం చేస్తుంది. మయోసైటిస్ సోకిన వాళ్ళు క్రయోథెరఫీ గొప్ప ట్రీట్మెంట్ అని సమాచారం. అందుకే సమంత ఈ ట్రీట్మెంట్ తీసుకుంటుంది.
కాగా సమంత అంత అనారోగ్య పరిస్థితులలో కూడా కొన్ని సినిమాలు చేసింది. ఈ ఏడాది శాకుంతలం చేసి దాని ప్రమొషన్ లో కూడా పాల్గోనింది. అంతకు ముందు యశోద మొన్న ఖుషి చిత్రం విడుదల చేసింది. శాకుంతలం (shakunthalam) డిజాస్టర్ అయ్యింది. ఖుషి (khushi) కొంత మేర విజయాన్ని నమోదు చేసింది. ఇక రాజ్ అండ్ డీకే డైరెక్షన్ లో సిటాడెల్ సిరీస్ చేసింది. పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సిరీస్ త్వరలో స్ట్రీమ్ కానుంది.
SURESH