Hi Nanna: మృణాల్ ఠాకూర్.. సీతారామం అంటూ దుల్కర్ సల్మాన్‌లాంటి నటుడితో టాలీవుడ్ ట్రావెల్ అయ్యింది. పాన్ ఇండియా లెవల్లో హిట్ సొంతం చేసుకుంది. తర్వాత నాని, ఆ వెంటనే విజయ్ దేవరకొండతో జోడీ అంటే చాలా సెలెక్టివ్‌గా వెళ్తోందన్నారు. ఆ ప్రాసెస్‌లోనే వచ్చిన హాయ్ నాన్న మాత్రం తన కొంపముంచేలా ఉంది. కారణం హాయ్ నాన్న ఎమోషనల్ డ్రామా మరో సీతారామం అన్నారు. కాని కథలో కొత్తదనం, మేకింగ్‌లో మ్యాజిక్ లేదంటున్నారు.
Dunki VS Salaar: డంకీని, సలార్‌ని జంతువే మింగేస్తుందా..?
మజ్నులో ప్రేయసికోసం తపన పడే ప్రేమికుడు, జెర్సీలో కొడుకు కోసం తపించే తండ్రి, ఈ రెండు కలిస్తే అదే హాయ్ నాన్నా అంటున్నారు. దీనికి కమల్ హాసన్ హిట్ మూవీ వసంత కోకిల ఫ్లేవర్ యాడ్ చేసి ఏదో కొత్తగా తీయబోయారు. కానీ, టాక్ వీక్ అవుతోంది. నాని, మృణాల్‌తో పాటు ఇందులో పాప కూడా పాత్రలో పాతుకుపోయింది. ఇక ఫలించందేమైనా ఉంటే అది కథ, కథనం, మేకింగ్. ఏదో ఏడిపించేస్తారనుకుంటే.. నెరేషన్‌తో కాదు, మ్యాటర్ లేని మూవీ చూపించి పరేషాన్‌తో ఏడిపిస్తున్నారు. ఇది ఈమూవీ మీద పెరిగిన మిక్స్‌డ్ టాక్. ఇక శ్రీలీల విషయానికొస్తే, శుక్రవారం తన ఫేట్ డౌట్‌లో పడేలా ఉంది. ఇప్పటి వరకు రామ్, వైష్ణవ్ తేజ్ లాంటి అన్ లక్కీ స్టార్స్‌తో జోడీకట్టి వరుస ఫెయిల్యూర్స్ ఫేస్ చేసింది.
కాబట్టి పుష్కరానికో హిట్ పట్టే నితిన్‌తో ఎక్స్ ట్రా కూడా కలిసి రాకుంటే.. హ్యాట్రిక్ ఫెయిల్యూర్స్ ఎకౌంట్‌లో పడుతాయి. ఐరన్ లెగ్ లాంటి హీరోలతో జోడీకట్టి తను కూడా ఐరన్ లెగ్‌గా మారేలా ఉందనే మాటే పెరుగుతోంది.