స్టార్ హీరోయిన్ కు హైకోర్ట్ షాక్, మేం ఏం చేయలేం…!

ఈ మధ్య కాలంలో వివాదాస్పద చిత్రాలు సంచలనం రేపుతున్నాయి. కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకుని సినిమాలు చేస్తున్నారనే ఆరోపణలు వినపడుతున్నాయి. కంగనా రనౌత్ దర్శకత్వంలో వచ్చిన ఎమర్జెన్సీ సినిమా కూడా దాదాపు ఇదే విధంగా వివాదంలో ఉంది.

  • Written By:
  • Publish Date - September 4, 2024 / 04:29 PM IST

ఈ మధ్య కాలంలో వివాదాస్పద చిత్రాలు సంచలనం రేపుతున్నాయి. కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకుని సినిమాలు చేస్తున్నారనే ఆరోపణలు వినపడుతున్నాయి. కంగనా రనౌత్ దర్శకత్వంలో వచ్చిన ఎమర్జెన్సీ సినిమా కూడా దాదాపు ఇదే విధంగా వివాదంలో ఉంది. ఇందిరా గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో ఎమర్జెన్సీ విధించిన సంగతి తెలిసిందే. అప్పట్లో దేశంలో ఉన్న పరిస్థితులు స్వాతంత్ర్య ఉద్యమ సమయం కంటే దారుణంగా ఉన్నాయని జనతా పార్టీ నేతలు ఆరోపణలు చేసేవారు. ఎందరో నేతలను అకారణంగా జైల్లో పెట్టారని అంటూ ఉంటారు.

వారిలో మాజీ ప్రధానులు వాజపేయి, దేవెగౌడ, బిజెపి అగ్ర నేతలు ఎల్కే అద్వాని, మురళీ మనోహర్ జోషీ సహా పలువురు ఉన్నారు. ఈ నేపధ్యంలో అప్పటి పరిస్థితుల ఆధారంగా సినిమాను తెరకెక్కించారు కంగనా. ఈ సినిమాలో ఇందిరా గాంధీ పాత్రను ఆమెనే పోషించారు. అయితే ఇప్పుడు ఈ సినిమాను అడ్డుకోవాలని సిక్కు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తమ వర్గాన్ని ఇందులో ఉగ్రవాదులుగా చూపించారని సిక్కు సమాజం ఆరోపణలు చేస్తుంది. తెలంగాణా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో ఈ సినిమాను అడ్డుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఇక మహారాష్ట్ర హైకోర్ట్ లో దీనిపై దాఖలు అయిన పిటీషన్ ను విచారించిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. సెన్సార్ బోర్డ్ ని సర్టిఫికేట్ ఇవ్వాలని తాము ఆదేశించలేమని, ఈ నెల 18 లోపు దీనిపై ఏదోక నిర్ణయం తీసుకోవాలని కోర్ట్ సెన్సార్ బోర్డ్ ని ఆదేశించింది. 19కి కేసు విచారణను వాయిదా వేసింది. అయితే ఈ సినిమా ఈ నెల ఆరున విడుదల కావాల్సి ఉంది. ఈ సినిమాను తెలంగాణాలో కూడా అడ్డుకోవాలని సిక్కు సమాజం ప్రభుత్వాన్ని కోరింది. మాజీ ఐపిఎస్ అధికారి ఆధ్వర్యంలో సిక్కు నేతలు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని కలిసి విజ్ఞప్తి చేసారు.