దేవర మూవీ ముంబై ఈవెంట్ సక్సెస్ అయ్యింది. చెన్నై ఈవెంట్ అదిరిపోయింది. బెంగులూరులో మొదలైన ఈ ప్రమోషనల్ జర్నీ, అంతటా బానే జరిగింది. కాని హైద్రబాద్ లో మాత్రం ఈవెంట్ క్యాన్సిల్ అయ్యింది. ఒక్కసారిగా ఉప్పెనలా వచ్చిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్ కి ఈవెంట్ లొకేషన్ తట్టుకోలేకపోయింది. ఇది చాలా వరకు ఫ్యాన్స్ కి మాత్రమే కాదు, ఫిల్మ్ టీంకి కూడా డిసప్పాయింటింగ్ అంశమే… ఎవరికీ ఎలాంటి ప్రమాధం జరక్కూడదని ఈవెంట్ ని క్యాన్సిల్ చేసుకున్నాడు ఎన్టీఆర్. అయినా దేవర ప్రమోషన్ లో ఎమోషన్ ఆగలేదు. సండే సెకండ్ ట్రైలర్ సునామీ క్రియేట్ చేస్తే, యూఎస్ లో ఎన్టీఆరే రంగంలోకి దిగాడు. అక్కడ ప్రమోషన్స్ ని పీక్స్ కి తీసుకెళుతున్నాడు.
దేవర హైద్రబాద్ ప్రీరిలీజ్ ఈవెంట్ కి 5500 కెపాసిటీ ఉన్న నోవాటెల్ లో 4 వేల మందికే ప్రవేశం పెడితే, ఏకంగా 30 వేల మంది ఫ్యాన్స్ వచ్చారు. అంతే ఆ ఈవెంట్ లొకేసన్ కెపాసిటీ మించి ఫ్యాన్స్ రావటంతో, ఎవరికేమౌతుందో అన్న కంగారులో, ఏకంగా ఈవెంట్ నే క్యాన్సిల్ చేశారు. ఇది దేవర ప్రమోషన్ లో చిన్న డిసప్పాయింటింగ్ ఎలిమెంటే.. కాకపోతే దేవర మీద జనాల అంచానలు, ఫ్యాన్స్ లో పూనకాలు ఎలా ఉన్నాయోచెప్పడానికి ఈ ఒక్క ఈవెంట్ చాలు…
అందుకే ఈ వేడి తగ్గకుండానే ప్రమోషన్ తో దాడి చేస్తున్నాడు ఎన్టీఆర్. తెలుగు ఈవెంట్ క్యాన్సిల్ అయినా, కొత్త ట్రైలర్ తో ఊపుపెంచాడు. ఇప్పుడు అమెరికాను ఊపేసే పనిలో ఉన్నాడు. ముందు ముంబై, అంతకుముందు కర్ణాటక, ఆతర్వాత చెన్నై ఈవెంట్లతో పాన్ ఇండియా లెవల్లో ప్రమోషన్ లో ఎమోషన్ పెంచిన ఎన్టీఆర్, యూఎస్ లో ఏకంగా 15 ఈవెంట్లకు ప్రిపేర్ అయ్యాడు
ఒకే చోట అందరినీ రప్పించటం కాకుండా, యూఎస్ లోని 4 నగరాల్లో 15 లొకేషన్స్ లో ప్రమోషనల్ ఈవెంట్స్ ప్లాన్ చేశాడు. అంతేకాదు అమెరికన్ టాక్ షోస్ తోపాటు అక్కడి న్యూస్ ఛానల్స్ లోకూడా ఎన్టీఆర్ ఇంటర్వూలు ఇవ్వబోతున్నాడట. అందుకు తగ్గ ఏర్పాట్లు జరిగాయి.
త్రిబుల్ ఆర్ తో తనకి వచ్చిన పేరు, నాటు నాటు పాటతో అమెరికన్స్ లో చరణ్ తో పాటు తరాక్ కి వచ్చిన గుర్తింపుని, ఇప్పుడు నెమరు వేసుకునే పనిలో ఉన్నాడు. రిలీజ్ కి ముందే దేవర మూవీ అడ్వాన్స్ బుక్కింగ్స్ రూపంలో 75 వేల టిక్కెట్లు సేల్ అవ్వటం 3 మిలియన్ల నుంచి 4 మిలియన్ డాలర్ల వరకు ముందే రావటం జరిగిపోయింది. ఇది అమెరికన్స్ కి కూడా ఆశ్చర్యాన్ని కలిగించే అంశమే… ఓ ఇండియన్ మూవీ ఎంతగా యూఎస్ మార్కెట్ లో రిలీజ్ కి ముందే హల్ చల్ చేస్తోంది అన్న కోణంతో, దేవరని కూడా అక్కడ ప్రమోట్ చేయబోతున్నారట. మొత్తంగా ఓవర్ సీస్ మార్కెట్ విషయంలో ఎన్టీఆర్ స్ట్రాటజీ నెక్ట్స్ లెవల్ లో ఉంది.