ఎస్ఎస్ రాజమౌళి. ఇప్పుడు ఈయన హాలీవుడ్ పీస్. బాహుబలి, ట్రిపులార్ సినిమాలతో ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు రాజమౌళి. దీంతో సహజంగానే ఆయన తరువాతి ప్రాజెక్ట్ అంటే అంచనాలు మామూలుగా ఉండవు. దీనికి తోడు ఆయన తరువాత చేయబోయే ప్రాజెక్ట్ మహేష్ బాబుతో. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అన్ని భాషల్లో మహేష్‌కి మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో వీళ్లిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుంది అంటే మరో రికార్డ్ కోసం ఫిలిం ఇండస్ట్రీ రెడీ అవుతున్నట్టే. ఇప్పటికే ఈ సినిమాను రెండు పార్ట్‌లుగా తీస్తున్నారనే గాసిప్ ఓ రేంజ్లో హైప్ క్రియేట్ చేసింది. ఇప్పడు అలాంటిదే మరో వార్త టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో చాలా మంది హాలీవుడ్ యాక్టర్స్‌ను తీసుకుంటున్నారట రాజమౌళి. ఇప్పటికే ట్రిపులార్ సినిమాలో చాలా మంది హాలీవుడ్ యాక్టర్స్ ఉన్నారు. ట్రిపులార్ సినిమాతో కంపేర్ చేస్తే మహేష్‌తో చేసే సినిమాలో ఇంకా చాలా మంది హాలీవుడ్ యాక్టర్స్ ఉండబోతున్నారని టాక్. ఇదే నిజమైతే సూపర్ స్టార్ మహేష్ బాబు నక్కతోక తొక్కినట్టే అంటున్నారు సినీ విశ్లేషకులు. ఈ సినిమా ద్వారా మహేష్ క్రేజ్ కూడా ప్రపంచవ్యాప్తం కాబోతోందంటున్నారు. ఇక టెక్నీషియన్స్ విషయానికోస్తే రాజమౌళి ఎక్కడా కాంప్రమైజ్ కారు. రెండు రోజులు కాకపోతే రెండు వారాలు. కానీ అవుట్‌పుట్ మాత్రం ఆయనకు నచ్చినట్టు రావాల్సిందే. దీనికోసమే ఎక్కువగా ఆయన హాలీవుడ్ టెక్నీషియన్స్‌తో పని చేస్తారు. మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాడుతుంటారు. మహేష్‌తో చేస్తున్న ప్రాజెక్ట్‌లో ట్రిపులార్‌ను మించిన విజువల్ వండర్స్ ఉండబోతున్నాయని రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో చెప్పేశారు. ఒక రకంగా చూస్తే ఇటు టెక్నీషియన్స్ అటు యాక్టర్స్ దాదాపు 70 శాతం హాలీవుడ్ క్రూనే ఉండబోతోందట. దీంతో ఈ సినిమా హాలీవుడ్ యాక్షన్ ఫిలిం కంటే ఏమాత్రం తక్కువగా ఉండే చాన్స్ లేదనే అంచనాలున్నాయి. అటు మహేష్ బాబు కటౌట్ కూడా హాలీవుడ్ హీరోస్‌కు ఏమాత్రం తక్కువగా ఉండదు. ఇక వీళ్లిద్దరి కాంబినేషన్లో పడే బొమ్మ ఏ రేంజ్లో ఉండబోతుందో చూడాలి.