పాన్ ఇండియా (Pan India) స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబినేషన్‌లో రూపొందుతున్న సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). ఎన్నో అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ చిత్రంపై హాలీవుడ్ (Hollywood) స్క్రీన్ రైటర్, నిర్మాత జోనాథన్ నోలన్ ప్రశంసలు జల్లు కురిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త వైరల్ అవుతుంది
ఇండియన్ ఫిలిం మేకర్స్ (Indian Film Makers) హాలీవుడ్ వాళ్ల కంటే బాగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. సినిమాలో ప్రతీ సీన్‌ను చాలా బాగా తీస్తున్నారని, హాలీవుడ్ సినిమాలతో పోటీ పడేలా టెక్నికల్ అంశాలను పొందుపరుస్తున్నారని కొనియాడారు. ఇక కల్కి చిత్రం గురించి మాట్లాడుతూ.. ఎవరూ, ఎలాంటి సలహాలు ఇవ్వాల్సిన పనిలేదని, టెక్నికల్‌గా ఎంతో హై రేంజ్‌లో ఉందని వెల్లడించారు.
సినిమా వీఎక్స్ విషయంలో నెక్ట్స్ లెవల్‌లో ఉండబోతుందని జోనాథన్ నోలన్ వెల్లడించారు. భారతీయ సినిమాల్లో లొకేషన్ల నుంచి స్టంట్స్ వరకు పలు అంశాలు ఆకట్టుకుంటాయని తెలిపారు. వ్యక్తిగతంగా తనకు సైన్స్ ఫిక్షన్ జానర్లో సినిమాలు రూపొందించడం చాలా ఇష్టం అందుకే కల్కి సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయని జోనాథన్ నోలన్ వెల్లడించారు. కల్కి 2898 ఏడీ చిత్రంలో ప్రభాస్ సరసన దీపిక పదుకొణే, దిశాపటాని హీరోయిన్లుగా నటిస్తున్నారు. అగ్ర కథనాయకులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది.