టాలీవుడ్ లో ప్రముఖ నటుడు నరేష్, పవిత్ర లోకేష్ ప్రేమించి పెళ్లి చేసుకోవడం పెద్ద ఎత్తున సంచలనం అయిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ ఇప్పుడు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. ఈ వ్యవహారం ఇప్పుడు మళ్ళీ హాట్ టాపిక్ అవుతోంది.నరేష్ జీవితంలోకి రావడానికి పవిత్ర లోకేష్ పెద్ద ప్లాన్ తోనే రెడీ అయిందని కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. అసలు ఇప్పుడు ఎందుకు ఈ వ్యవహారం మళ్ళీ లైం లైట్ లోకి వచ్చిందో చూద్దాం.
ఇటీవల నరేష్… విజయ కృష్ణ స్మృతి వనం ప్రారంభించారు. ఇది చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి పవిత్ర లోకేష్ తో కలిసి వచ్చారు నరేష్. దాదాపు 5 ఎకరాల్లో ఏర్పాటు చేసారు స్మృతి వనం. ఇక అక్కడ పవిత్ర బాగా హైలెట్ అయింది. హైదరాబాద్ లో 5 ఎకరాలంటే మీరే ఊహించుకోండి. అది కూడా అంతటి ఖరీదైన ప్రాంతంలో. ఇక నరేష్ ఇల్లు కూడా చాలా ఖరీదైన ప్రాంతంలో ఉంటుంది. దానికి తోడు… భారీ ఎత్తున టవర్స్ సహా పలు బిల్డింగ్ లో వారి సొంతం. ఇవన్నీ నరేష్ ఇంటి పక్కనే ఉన్నాయి కూడా.
ఇటీవల వీటికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. నరేష్ కార్లు, ఆయన ఉండే ఇల్లు, ఆయనకు సంబంధించిన బిల్డింగ్ లు ఇలా అన్నీ ఒక యూట్యూబ్ ఛానల్ తమ ఇంటర్వూలో చాలా క్లియర్ గా చూపించింది. ఇలా నరేష్ కు ఉన్న ఆస్తులు ఎప్పుడూ బయటకు రాలేదు. అవన్నీ కృష్ణ, విజయ నిర్మల మరణించిన తర్వాతనే జనాలు ఈ విధంగా చూసారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే టాలీవుడ్ లో నరేష్ రిచ్ యాక్టర్… సాదా సీదా రిచ్ కాదు… రిచ్ కు అమ్మ మొగుడు అన్నట్టు.
అలాంటి నరేష్ లైఫ్ లోకి వెళ్తే ఇక తన జీవితానికి తిరుగు ఉండదని, వెనక్కు తిరిగి చూసుకునే పని ఉండదని, తన పిల్లల కెరీర్ కూడా నరేష్ చూసుకుంటారని భావించి పవిత్ర నరేష్ కు దగ్గరయ్యారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు వాటిని తప్పుబడుతున్నారు. డబ్బులు ఎంత ఉన్నా కొంత వరకే ఎంజాయ్ చేస్తామని, ఆమె ఏమీ చిన్న పిల్ల కాదని, నరేష్ కు ప్రేమతో దగ్గరై జీవితాన్ని పంచుకున్నారని అంటున్నారు.