3 సినిమాల డీల్ వెనక 1000 కోట్లు… 500 కోట్ల కటౌట్ నిజమే…

రెబల్ స్టార్ తోహోంబలే సంస్థ చేసుకున్న 3 సినిమాల ఒప్పుందం, పాన్ ఇండియా మార్కెట్ ని కుదిపేస్తోంది.ఖాన్లు, కపూర్లకు కూడా సాధ్యం కాని ఎమౌంట్ ప్రభాస్ ఎకౌంట్ లో పడిపోతోంది. విచిత్రం ఏంటంటే మూడు సినిమాలకు గానూ తనకి 550 కోట్లు మాత్రమే దక్కుతున్నాయనే వార్తొచ్చింది.

  • Written By:
  • Publish Date - November 11, 2024 / 05:46 PM IST

రెబల్ స్టార్ తోహోంబలే సంస్థ చేసుకున్న 3 సినిమాల ఒప్పుందం, పాన్ ఇండియా మార్కెట్ ని కుదిపేస్తోంది.ఖాన్లు, కపూర్లకు కూడా సాధ్యం కాని ఎమౌంట్ ప్రభాస్ ఎకౌంట్ లో పడిపోతోంది. విచిత్రం ఏంటంటే మూడు సినిమాలకు గానూ తనకి 550 కోట్లు మాత్రమే దక్కుతున్నాయనే వార్తొచ్చింది. అది కొంతవరకు నిజమే కాని, సినిమాకు 3 కోట్లు తీసుకునే ప్రభాస్ మూడు సినిమాలు చేయాలంటే 900 కోట్లు తీసుకోవాలి… కాని 550 కోట్లకే సరే అనటం వెనకే మైండ్ బెండింగ్ రీజనుంది. హోంబలే ప్రొడక్షన్ హౌజ్ తో జరిగిన డీల్ ప్రకారం చూస్తే 550 కోట్లు మూడు సినిమాలకు కుదిరిన ఒప్పందం అనేది ఎంత నిజమో… ప్రభాస్ రెమ్యునరేషన్ 500 కోట్లకు చేరిందనే మాట మూడు కాదు నాలుగుసార్లు నిజం… అదెలానో చూసేండి..?

ప్రభాస్ తో హోంబలే నిర్మాణ సంస్థ మూడు సినిమాలకు డీల్ పూర్తి చేసింది. రెబల్ స్టార్ తో 2026, 2027, 2028 లో సినిమాలు రిలీజ్ చేస్తున్నట్టు బాంబు పేల్చింది. అదే రెబల్ ఫ్యాన్స్ కి పూనకాలు తెచ్చే న్యూస్ అంటే, ఇందులో అంతకు మించిన ట్విస్ట్ ఉంది.. అదే రెబల్ స్టార్ ని హాలీవుడ్ హీరోగా మార్చేస్తోంది

అదే రెమ్యునరేషన్.. హంబలే సంస్థ డీల్ ప్రకారం వీళ్లకు కమిటైన 3 సినిమాలకు ప్రభాస్ 575 కోట్లు అందుకుంటున్నాడు. ఆలెక్కన సినిమాకు 150 కోట్ల వరకు రెమ్యూనరేషషన్, అంటే 450 కోట్లు పారితోషికం, మిగతా125 కోట్లు ప్రమోషన్ కోసం ఎడీషనల్ గా చెల్లించారట. కాని ఈ లెక్కల ప్రకారం ప్రభాస్ పారితోషికం 150 కోట్లను మించదు. కాని తను సలార్ టైంలోనే 200 కోట్లు, కల్కీకి 300 కోట్లు తీసుకున్నాడు. ఇప్పుడు ఏకంగా 500 కోట్ల స్టార్ గా మారాడు..

ఆల్రెడీ స్పిరిట్ కి తను 500 కోట్ల వరకు పారితోషికం తీసుకోవటం కన్ఫామ్ అయిపోయింది. అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ డిసెంబర్ 25న రాబోతోందని తెలుస్తోంది. ఇలాంటి టైంలో ఎప్పుడో సాహో టైంలో ప్రభాస్ తీసుకున్న 150 కోట్ల పారితోషికం ఇచ్చి హోంబలే ఇదేదో వండర్ అన్నట్టు ప్రచారం చేస్తోందా? అంటే కానే కాదు.

హోంబలే ప్రొడక్షన్ హౌజ్ ప్రభాస్ కి ఇచ్చిన 3 సినిమాల రెమ్యూనరేషన్ అదే ఫైనల్ కాదు. సినిమాలో ప్రాఫిట్ షేర్ అలానే ఉంచింది. అంటే తెలుగు స్టేట్స్ తోపాటు ముంబై, డిల్లి, పూనే, లక్నో సిటీల్లో తమ సినిమా రైట్స్ ని ప్రభాస్ కే ఇచ్చారట. అక్కడ ప్రభాస్ సినిమాలు వసూల్ చేసిన తన గత సినిమాల లెక్కలు చూస్తే, సినిమాకు 150 కోట్లు, ఏరియారైట్స్, ప్రాఫిట్ షేర్ ప్రకారం చూస్తే సినిమాకు 500 కోట్ల పైనే ప్రభాస్ కి దక్కే అవకాశాలున్నాయి

అంటే హోంబలే నిర్మాణ సంస్థ మూడు సినిమాల ఆఫర్ ప్రకారం, ఇప్పుడు 575 కోట్లు, రిలీజ్ టైంలో 900 కోట్లు.. విడుదలై వసూళ్ల వరదొచ్చాక 1500 కోట్లు.. అంటే సినిమాకు కనీసం 500 కోట్లు దక్కించుకోబోతున్నాడు ప్రభాస్.. ఇదే బాలీవుడ్ ఖాన్లూ, కపూర్లు, కుమార్లని షాక్ కి గురి చేస్తున్నాయి. రజినీకాంత్, జాకీ చాన్ లను కూడా మించి హాలీవుడ్ స్టార్స్ రేంజ్ లో పారితోషికంతో, వరల్డ్ టాప్ 5 స్టార్స్ లో జాయిన్ అవుతున్నాడు ప్రభాస్..

ఆల్రెడీ స్పిరిట్ మూవీకి 500 కోట్లు తీసుకోబోతున్న ప్రభాస్, ఇలాసలార్ 2 కి ఆతర్వాత కూడా హోంబలే నిర్మించే మిగతా రెండు సినిమాలకు 500 కోట్లు తీసుకుంటున్నాడంటే, ఇలా మొత్తం నాలుగు మూవీలతో 2 వేల కోట్లు సొంతం చేసుకున్నట్టే.. ఇది డీల్ లోతుల్లో ఉన్న కొండంత ఎమౌంట్…