ఇండియన్ సినిమాలో ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ ను బీట్ చేసే హీరో లేడు అనడంలో ఏ డౌట్ లేదు. ప్రభాస్ సినిమాల దెబ్బకు ఇప్పుడు ఏ వుడ్ అయినా షేక్ అవుతోంది. అందులో నో డౌట్. ఇక ప్రభాస్ ఒక్కో సినిమాతో బాలీవుడ్ ను కూడా డామినేట్ చేస్తూ ఆల్మోస్ట్ తొక్కాడు అనే చెప్పాలి. అక్కడి స్టార్ హీరోల సినిమాల కలెక్షన్ లు ప్రభాస్ ఫ్లాప్ మూవీ కలెక్షన్ కంటే తక్కువగానే ఉన్నాయనే టాక్ ఉంది. ఇక బాలీవుడ్ హీరోలు ప్రభాస్ ను బీట్ చేయడానికి చాలానే కష్టపడుతున్నా పెద్దగా వర్కౌట్ కావడం లేదు.
ఇప్పుడు ప్రభాస్ లైనప్ చూస్తే బాలీవుడ్ గుండెల్లో రైళ్ళు పరిగెట్టడం ఖాయంగా కనపడుతోంది. 7 సినిమాలను లైన్ లో పెట్టి మూడేళ్ళు టార్గెట్ పెట్టుకున్నాడు. వీటిల్లో మళ్ళీ భక్త కన్నప్ప బోనస్ మూవీ. మరో సినిమాలో కూడా గెస్ట్ రోల్ చేసే ఛాన్స్ ఉందనే టాక్ కూడా వస్తోంది. ఇక ప్రభాస్ తో తమ సినిమాల లైనప్ ను కన్నడ దిగ్గజ సినిమా నిర్మాణ సంస్థ ప్రకటించి సంచలనం సృష్టించింది. కన్నడ హీరోల కంటే ప్రభాస్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం. టాలీవుడ్ గాని ఏ వుడ్ లో అయినా సరే అంత రిస్క్ చేయడం లేదు ఆ సంస్థ.
ప్రభాస్ తో మూడు సినిమాలు చేస్తామని… 2026 నుంచి 2028 వరకు వరుసగా మూడేళ్ళు మూడు సినిమాలను తమ బ్యానర్ లో ప్రభాస్ హీరోగా రిలీజ్ చేస్తామని ప్రకటన చేసింది. ఆ ప్రకటన చూసి బాలీవుడ్ కూడా షాక్ అయింది. సలార్ 2 సినిమా నుంచి ఈ లైనప్ మొదలయింది అని ప్రకటన చేసింది. సలార్ 2 షూట్ కూడా మొదలైనట్టు ప్రకటించింది. దీనితో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. సలార్ 2 మూడేళ్ళ తర్వాత అంటే ప్రశాంత్ నీల్ చేసే సినిమాల తర్వాత వచ్చే ఛాన్స్ ఉందని అందరూ భావించారు.
కాని హోంబలే మాత్రం 2026 లోనే ఆ సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించింది. ఇది పక్కన పెడితే ప్రభాస్ కు భారీగా రెమ్యునరేషన్ ఇవ్వడానికి హోంబలే రెడీ అయింది. ప్రభాస్ కు ఒక్కో సినిమాకు 250 కోట్లు ఇవ్వడానికి హోంబలే ఒప్పందం చేసుకుంది. అంటే మూడు సినిమాలకు 750 కోట్ల రూపాయలు. అంటే బాలీవుడ్ హిట్ సినిమా… హిట్ కూడా కాదు బ్లాక్ బస్టర్ హిట్ సినిమా కలెక్షన్ అది. రెమ్యునరేషన్ ఇలా ఉంటే ఫ్యూచర్ లో వాటికి వచ్చే వసూళ్లు ఏ రేంజ్ లో ఉంటాయో మరి…?