పాన్ ఇండియా లెవెల్ లో హిట్ అయిన సినిమా ఆఫర్ ను వదులుకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది…? అది చరిత్రలో నిలిచిపోయిన సినిమా అయితే… ఆ బాధ అనుభవించిన వాడికే తెలుస్తుంది కదా. ఆ బాధ అనుభవించాడు తమిళ స్టార్ హీరో విక్రం. వచ్చిన బంగారం లాంటి ఆఫర్ ను చిన్న తప్పుతో పోగొట్టుకున్నాడు. అసలు ఏంటి ఆ ఆఫర్… ఎందుకు పోయిందో చూద్దాం. ప్రస్తుతం తంగలాన్ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న విక్రం… వరుస కార్యక్రమాల్లో బిజీ అయిపోయారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
దర్శకుడు… మణిరత్నం అంటే నాకెంతో ఇష్టం అంటూ చెప్పుకొచ్చిన విక్రం, ఆయన ఫిలిం మేకింగ్ స్టైల్ ను ఎంతగానో ఇష్టపడతా అని చెప్పుకొచ్చాడు. కెరీర్ ఆరంభంలో ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలని కలలు కనేవాడిని అంటూ అప్పటి రోజులను గుర్తు చేసుకున్నాడు విక్రం. ఆ సినిమా తర్వాత రిటైర్ కావడం కూడా తనకు ఇష్టమే అన్నాడు. ఈ క్రమంలోనే తనకు బొంబాయి సినిమా ఆఫర్ వచ్చిందని హీరోగా తనను సెలెక్ట్ చేసారని ఆసక్తికర విషయం చెప్పాడు. కాని అప్పుడు చేసిన తప్పుతో ఆ ఆఫర్ పోయింది అన్నాడు.
ఫైనల్ ఆడిషన్ లో భాగంగా వీడియో కాకుండా స్టిల్ కెమెరా తీసుకొచ్చారని… సీన్ వివరించి యాక్ట్ చేయమని చెప్తే… మామూలు కెమెరా తీసుకొచ్చి యాక్ట్ చేయమంటారు ఏంటీ… ఎందుకు యాక్ట్ చేయాలనిపించింది అని… స్టిల్ కెమెరా కావడంతో తాను మూవ్ అయితే బ్లర్ వస్తుందని చేయకుండా అలాగే ఉండిపోయా అని విక్రం చెప్పుకొచ్చాడు. దాని గురించి రెండు నెలలు బాధ పడ్డా అని… ప్రతీ రోజు ఉదయం నిద్ర లేవడం, ఏడుస్తూ కూర్చోవడమే అని… ఆ తర్వాత అది పాన్ ఇండియా కల్ట్ మూవీ అయిందని విక్రం గుర్తు చేసుకున్నాడు. బొంబాయి సినిమాలో అరవింద్ స్వామీ నటించిన సంగతి తెలిసిందే.