Fighter: బిగ్ షాక్.. ఫైటర్‌పై నిషేధం.. కోట్లలో నష్టం

గణతంత్ర దినోత్సవం కానుకగా జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది ఫైటర్. ఫైట్ సీన్స్ ఎక్కువ ఉండటంతో ఫైటర్ మూవీని గల్ప్ దేశాలు బ్యాన్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఫైటర్ నిషేధంపై మూవీ టీమ్ మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు.

  • Written By:
  • Publish Date - January 24, 2024 / 01:46 PM IST

Fighter: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, దీపికా పదుకొణె నటించిన ఫైటర్ మూవీకి ఊహించని షాక్ తగిలింది. మరో రెండు రోజుల్లో రిలీజ్ అవుతున్న మూవీని బ్యాన్ చేశారన్న న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది. వార్, పఠాన్ చిత్రాల దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్.. ఫైటర్ మూవీని తెరకెక్కించారు. దీంతో ఫైటర్ మూవీపై క్రేజీ బజ్ క్రియేట్ అయింది. రీసెంట్‌గా రిలీజైన ట్రైలర్‌తో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈమూవీ బ్యాన్ కావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

TOLLYWOOD MOVIES: అసలేం జరుగుతోంది! పాన్ ఇండియా సినిమాలన్నీ వాయిదా..

బాలీవుడ్ నుంచి ఇప్పటికీ చాలా దేశభక్తి సినిమాలు వచ్చాయి. ఈ మధ్యే పఠాన్, టైగర్ 3 వంటి దేశభక్తి సినిమాలతో షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ బాక్సాఫీస్ వద్ద సందడి చేశారు. ఇప్పుడు ఇదే ఇండియన్ పాట్రియాటిజం కథతో ఏరియల్ యాక్షన్ మూవీగా వస్తోంది ఫైటర్. గణతంత్ర దినోత్సవం కానుకగా జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది ఫైటర్. ఫైట్ సీన్స్ ఎక్కువ ఉండటంతో ఫైటర్ మూవీని గల్ప్ దేశాలు బ్యాన్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఫైటర్ నిషేధంపై మూవీ టీమ్ మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. యూఏఈ మినహా దాదాపు గల్ఫ్ దేశాలన్నింటిలో ఫైటర్ మూవీని నిషేధించారు. అయితే తీవ్రవాదం లేదా భారత్-పాకిస్థాన్ వివాదాల అంశాలతో తీసిన సినిమాలను గల్ఫ్ దేశాల్లో నిత్యం బ్యాన్ చేస్తుంటారు.

రీసెంట్‌గా సల్మాన్ భాయ్ నటించిన టైగర్ 3 సినిమాను కూడా నిషేధించారు. అదే తరహాలో ప్రస్తుతం ఫైటర్ సినిమా కూడా బ్యాన్ అయింది. ఇక యూఏఈలో మాత్రం 15 వర్గీకరణతో సెన్సార్ ఆమోదించిందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే గల్ఫ్ కంట్రీస్‌లో నిషేధం వల్ల ఫైటర్ సినిమాకు మిలియన్ డాలర్ల వసూళ్ల నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది.