DEVARA: ఎన్టీఆర్ దేవర మూవీ అక్టోబర్ 10న రిలీజ్ కాబోతోంది. కాకపోతే రాజమౌళి డైరెక్షన్‌లో చేసిన తర్వాత ఏ హీరో అయినా సరే.. మరే మూవీ చేస్తే ప్లాపైపోతుంది. చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ ఇలా అందరికీ ఇదే జరిగింది. కాబట్టే ఈ సెంటిమెంట్ భయపెడుతోంది. అలాంటి టైంలో దేవర హిట్‌ని రిలీజ్‌కి ముందే కన్ఫామ్ చేస్తున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. దేవర అక్టోబర్ 10కి రాబోతోంది. రిలీజ్ డేట్ ఎప్పుడో ఫిక్స్ చేశారు.
SSMB 29: రాజమౌళి-మహేశ్ సినిమా ముహూర్తం ఫిక్స్.. ఆ రోజే అనౌన్స్‌మెంట్
అయితే ఇది రాజమౌళి సెంటిమెంట్‌ని బ్రేక్ చేయాలి. అంతకుమించి సెప్టెంబర్‌లో వచ్చే ఓజీ, అక్టోబర్ చివర్లో వచ్చే గేమ్ ఛేంజర్‌తో పోటీ పడాలి. ఇన్ని అవరోధాల మధ్య దేవరకి ఒకే ఒక్క సపోర్ట్ హృతిక్ రోషన్ రూపంలో దొరకబోతోంది. అక్టోబర్ 1 న వార్ 2 మూవీ తాలూకు టీజర్ రాబోతోంది. అంతేకాదు దేవర 1 మూవీకి హృతిక్ రోషన్ నార్త్ ఇండియాలో ప్రమోట్ చేయబోతున్నాడు. రంగంలోకి దిగబోతున్నాడు. దేవర అక్టోబర్ 10న వస్తుంటే, అందుకు పదిరోజుల ముందు హిందీ మూవీ వార్ 2 టీజర్ వస్తే ఆ కిక్కే వేరు. వార్ 2 లో హృతిక్ హీరో, తారక్ విలన్‌గా చేస్తున్నారు. గురు, శిష్యుల యుద్దంలా ఇది ఉండబతోంది.
అలాంటి ఈ సినిమా టీజర్ దేవర రిలీజ్‌కు కాస్త ముందు వస్తే, నార్త్ ఇండియాతోపాటు సౌత్‌లోకూడా ఎన్టీఆర్ మీద అందరి అటెన్షన్ వస్తుంది. పరోక్షంగా ఇది దేవర మూవీ మీద అంచనాల భారం పెంచుతుంది. ఓపెనింగ్స్ అదిరిపోయేలా చేస్తుంది. ఏమాత్రం టాక్ బాగున్నా, ఇక ఎన్టీఆర్ ఎకౌంట్‌లో బ్లాక్ బస్టర్ పడినట్టే.