దీనమ్మ జీవితం ఇదేం డిమాండ్… రెబల్ ఫ్యాన్స్ కి పూనకాలే..

రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగ కమిటైన మూవీ స్పిరిట్. ఆ సినిమా తాలూకు చాలా మార్పులు చేర్పులు, కథలో కాదు, మేకింగ్ లో పెరిగాయి.ఇంకా షూటింగ్ మొదలు కాలేదు. ఇప్పడే షూటింగ్ మొదలయ్యేలా లేదు.

  • Written By:
  • Publish Date - October 9, 2024 / 02:10 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగ కమిటైన మూవీ స్పిరిట్. ఆ సినిమా తాలూకు చాలా మార్పులు చేర్పులు, కథలో కాదు, మేకింగ్ లో పెరిగాయి.ఇంకా షూటింగ్ మొదలు కాలేదు. ఇప్పడే షూటింగ్ మొదలయ్యేలా లేదు. అయినా సందీప్ రెడ్డి స్పిరిట్ మేకింగ్ తాలూకు భారీ నిర్ణయం తీసుకున్నాడు. రెబల్ స్టార్ కి ఉన్న క్రేజ్, ఇమేజ్ ని ద్రుష్టిలో పెట్టుకుని ఊహించని డిమాండ్ చేశాడట సందీప్. బేసిగ్గా పాన్ ఇండియా కింగ్ గా రెబల్ స్టార్ కి ఉన్న ఇమేజ్ వల్ల, ప్రభాసే డిమాండ్ చేయాలి… కాని ఇక్కడ కథంతా రివర్స్ రూట్లో నడుస్తోంది. అంటే మహమాటంతో ప్రభాస్ అలాంటి ఛాన్స్ ఇచ్చాడా? లేదంటే సందీప్ రెడ్డి డిమాండ్ లో నిజాయితీ కనిపించిందా? ఇంతకి ఆ డిమాండ్ వెనకున్న కమాండ్ ఏంటి? స్పిరిట్ మూవీ మేకింగ్ లో అంత ఆశ్చర్య కరమైన అంశమేముంది..?

రెబల్ స్టార్ రేంజ్ రోజు రోజుకి పెరిగిపోతోంది. ఎవరెస్ట్ శిఖరం ఎత్తు ఎలాగైతే స్తిరంగా కాకుండా, మిల్లీ మీటర్ల లెక్కన పెరుగుతోందో, పాన్ ఇండియా కింగ్ రెబల్ స్టార్ క్రేజ్ అంతకంతకు పెరిగిపోతోంది. బాహుబలి 2, సలార్, కల్కీ హిట్లతో కాదు, తన ఫెల్యూర్ మూవీలతో లెక్కేసి చెబుతున్నాడు సందీప్ రెడ్డి వంగ.

రాధేశ్యామ్, ఆదిపురుష్ లాంటి ఫెల్యూర్స్ కి వచ్చిన వసూళ్లు చాలు బాక్సాఫీస్ ని రెబల్ స్టార్ ఏ రేంజ్ లో ఆడుకుంటాడో చెప్పటానికి. ఆరేంజ్ క్రేజ్, ఇమేజ్ తనకి సొంతం కాబట్టే, దానికి తగ్గట్టే రెబల్ స్టార్ మూవీ ఉండాలి.. అందుకే సందీప్ రెడ్డి వంగ, స్పిరిట్ విషయంలో ఛాన్స్ తీసుకోనని తేల్చేశాడు.

తను కొన్ని విషయాల్లో ఊహించని డిమాండ్లు చేశాడు. అది రెబల్ స్టార్ కి ఆల్ మోస్ట్ చాలా కష్టం.. కాని స్పిరిట్ కథ విన్నాకే, ప్రభాస్ చాలా రిస్కీ డిసీజన్ తీసుకున్నాడని తెలుస్తోంది. అదే స్పిరిట్ మూవీ చేస్తున్నప్పుడు మరే మూవీ చేయకుండా ఉండాలనే సందీప్ రెడ్డి కండీషన్ కి ఒప్పుకోవటం

ప్రభాస్ ఓ సినిమాచేస్తున్నాడంటే,మరో మూవీ పట్టాలెక్కాలి, ఇంకో సినిమా సెట్స్ పైకెళ్లేందుకు సిద్దం అవ్వాలి. బాహుబలి తర్వాత సాహో, రాధే శ్యామ్ టైం నుంచి ఇదే ఫార్ములా ఫాలో అవుతూ వస్తున్నాడు. అందుకే ఏడాదికో బ్లాక్ బస్టర్ కొడుతున్నాడు

ఇప్పుడు ది రాజా సాబ్ ని డిసెంబర్ లోగా పూర్తిచేసే పనిలో ఉండగానే, హనురాఘవపూడీ మేకింగ్ లో ఫౌజీనిలాంచ్ చేశాడు. తను లేని సీన్ల షూటింగ్ తో హను రాఘవపూడీ కూడా వేగం పెంచాడు. ఐతే ఫౌజీతో పాటు స్పిరిట్ కూడా ప్యార్ లల్ గా తెరకెక్కుతుందని అంతా అనుకున్నారు. కాని అలా కుదరదని తేల్చేశాడు సందీప్ రెడ్డి వంగ

రాధేశ్యామ్ చేస్తుండగానే, ఆదిపురుష్ మూవీ చేయటం వల్ల లుక్ నుంచి మేకింగ్ వరకు సినిమాకు సరైన న్యాయం జరగలేదు. ఏదో రెబల్ స్టార్ క్రేజ్ వల్ల ఆగిపురుష్ కి 700 కోట్లు పెట్టుబడి 720 కోట్ల రాబడిగా మారి, నిర్మాతకి నష్టం లేకుండా చేసింది. కాని లేదంటే ఆదిపురుష్ లోతను కాకుండా మరో హీరో ఉంటే, నిర్మాత రోడ్డున పడే పరిస్థితి…

సో ప్రభాస్ లాంటి పాన్ ఇండియా కింగ్ రేంజ్ ఇమేజ్ ఉన్న హీరో తోసినిమా అంటే, గట్టిగానే ప్లాన్ చేయాలి. అందులోనూ అర్జున్ రెడ్డి, యానిమల్ లాంటి స్ట్రాంగ్ హీరోయిజం ఉన్న సినిమాలు తీసిన సందీప్ రెడ్డి మూవీ అంటే, నెక్ట్స్ లెవల్లో సినిమా ఉంటుంది. దీనికి తోడు పోలీస్ గా, డాన్ గా ప్రభాస్ కనిపించబోతున్నాడంటే, తన లుక్, ఫోకస్ ఆస్థాయిలోనేఉండాలి… అందుకే ఫౌజీ షూటింగ్ సగం అయ్యాక, 2025 సమ్మర్ లో స్పిరిట్ షూటింగ్ ప్లాన్ చేశాడట సందీప్. అదయ్యే వరకు మరో మూవీ చేయకూడాదనే కండీషన్ కి ప్రభాస్ ఒప్పుకున్నాడనే వార్తలతో, ఇంకా పట్టాలెక్కని ఈ ప్రాజెక్ట్ మీద కొండంత హైప్ ఇప్పటి నుంచే పెరిగిపోతోంది.