Hydrogen bus: త్వరలో టాటా హైడ్రోజన్ బస్సులు..! గేమ్ ఛేంజర్ కాబోతోందా?

అత్యంత అధునాతనమైన హైడ్రోజన్ బస్సులు అతి త్వరలో రోడ్డుపై పరుగులు పెట్టనున్నాయి‎. తాజాగా మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (meil) గ్రూప్ సంస్థ అయిన ఒలెక్ట్రా గ్రీన్ టెక్ ఈ బస్సులను ఆవిష్కరించింది. దీనికి కావల్సిన టెక్నాలజీని రిలయన్స్ గ్రూప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ అందజేసింది.

  • Written By:
  • Updated On - February 24, 2023 / 01:42 PM IST

సాధారణంగా మనం ఎక్కడికి వెళ్ళాలన్నా వాహనం తప్పనిసరి అయిపోయింది. నడకను దాదాపు అటకెక్కించేశాము. పక్క సందులోకి వెళ్లి చిన్న పాలప్యాకేట్ తీసుకురావాలన్నా ద్విచక్రవాహనాన్ని వినియోగిస్తున్నాము. దీనివల్ల పాలప్యాకేట్ పై వెచ్చించే ఖర్చు కంటే మనం వెళ్లిరావడానికి అయ్యే ఇంధనం ఖర్చు ఎక్కువ అవుతుంది. ఖర్చుతో పాటూ పర్యావరణ కాలుష్యం కూడా తలెత్తుతుంది. దీనికి తెరదించేందుకు బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొచ్చారు. వీటివల్ల ఇంధన ఖర్చు తగ్గుతుంది. కాలుష్యం అంతగా ఉండదు. సరే ఇదంతా ఒకెత్తైతే ఇప్పుడు వీటన్నింటినీ పక్కకునెట్టి ముందు వరుసలో స్థానాన్ని కల్పించుకోవడం కోసం వచ్చేసింది హైడ్రోజన్ బస్సు. అదేంటి పెట్రోల్, డీజల్, బ్యాటరీల సహాయంతో నడిచే వాహనాలను చూశాం. హైడ్రోజన్ తో వాహనాలు ఎలా నడుస్తాయనే ఆశ్చర్యం మీ అందరిలో కలుగుతుంది. వీటన్నింటికీ సమాధానాలను ఇప్పుడు చూసేద్దాం.

ఆలోచనలో టాటా ముందు:
హైడ్రోజన్ అంటే నీరు. నీటితో వాహనం నడుస్తుందా.. అదెలా అనే ప్రశ్న మీలో తలెత్తవచ్చు. నీటితో నడవడమే కాదు. వాహనం ఆన్ చేస్తే పొగ బదులుగా నీటినే విడుదల చేస్తుంది. ఈ బస్సుకు పై భాగంలో హైడ్రోజన్ ను అధిక పీడనం వద్ద కొన్ని కంటైనర్స్లో నింపుతారు. ద్రవరూపంలో ఉండే హైడ్రోజన్ ను ఉత్పత్తి చేయడం.. నిక్షిప్తం చేయడం.. హ్యాండిల్ చేసే అధునాతన సాంకేతికత ఇస్రో వద్ద ఉంది. దీని రక్షణ విషయంలో కూడా మంచి నైపుణ్యాత్మకంగా ఈ ఫార్ములాను అభివృద్ది చేసింది. చాలా సంవత్సరాల క్రితం ఈ బస్సు ఆకారాన్ని, డిజైన్ ను టాటామోటార్స్ కి సంబంధించిన వాహన తయారీ విభాగం చేపట్టింది. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ తయారీకి అవసరమయ్యే టెక్నాలజీని ఇస్రో అందజేసింది. భారతదేశంలోనే మొట్టమొదటి హైడ్రోఫ్యూయల్ బస్సును తయారు చేస్తున్నామని అప్పట్లో ఈ ఇరు సంస్థలు చెప్పుకొచ్చాయి. దీనికి ఇండియన్ ఆయిల్ ప్రోత్సాహం కూడా ఉంది. సుమారు 5 సంవత్సరాల క్రితం టాటా సంస్థ, ఇండియన్ ఆయిల్, ఇస్రో సంయుక్తంగా శ్రీకారం చుట్టిన ఈ సరికొత్త ఫార్ములాకి నేడు కార్యరూపం దాల్చి ప్రజలకు అందుబాటులో వచ్చింది. ఈ రకమైన బస్సులు ఇంగ్లాండ్లో దశాబ్దం నుంచే అందుబాటులో ఉన్నాయి. అత్యంత సౌకర్యవంతమైన ప్రజారవాణాలో వీటిని ఉపయోగిస్తున్నాయి. పర్యావరణ పరిక్షణ లక్ష్యంగా అక్కడ వీటిని ఏర్పాటు చేశారు.

hydrogen bus zero emission

బస్సు ఫీచర్లు భళా:
ఈ బస్సు పనితీరు విషయానికొస్తే దీనిపై భాగంలో టైప్ 4 హైడ్రోజన్ సిలిండర్లను ఏర్పాటు చేశారు. ఈ సిలిండర్లు కనిష్టంగా -20 నుంచి గరిష్టంగా +85 డిగ్రీల సెల్సియస్ వరకూ వీటినుంచి వెలువడే ఉష్ణోగ్రతను తట్టుకునేలే దీని నిర్మాణాన్ని చేపట్టారు. ఇందులో ఒక్కసారి ఫుల్ ట్యాంక్ నీటిని నింపితే 400 కిలోమీటర్ల వరకూ ప్రయాణించవచ్చని ఈ సంస్ధ తెలిపింది. ఈ ఒలెక్ట్రా బస్సులో హైడ్రోజన్ నింపడానికి కేవలం 15 నిముషాల సమయం మాత్రమే పడుతుందని తెలిపారు. ఇక దీని పోడవు విషయానికొస్తే 12 మీటర్లు ఉంటుంది. బస్సులోని డ్రైవర్ సీటు కాకుండా 32 నుంచి 49 మంది ప్రయాణీకులు కూర్చునేలా సీటింగ్ ఏర్పాటు చేశారు. ఇందులో హైడ్రోజన్ ఫ్యూయల్ బ్యాటరీ ఉంటుంది. దీనికి తప్పకుండా ఛార్జింగ్ చేయాలి. ఇంధన వాహనాలకు ఏమాత్రం తీసిపోకుండా ఈ హైడ్రో ఇంధన రహిత వాహనం పరుగులు తీస్తుంది. దీనిని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజలకు కాలుష్యరహిత రవాణా సౌకర్యాన్ని అందించాలని ఒలెక్ట్రా గ్రీన్ టెక్ నిర్ణయించింది.

నూతన ప్రయోగం- దేశానికి ఉపయోగం:
ఇంధనంతో నడిచే వాహనాలు అధికపొగను వెలువరిస్తాయి. ఆ పొగలోని కర్భనం ద్వారా రోజురోజుకూ పర్యావరణానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుంది. దీనికి ప్రత్యమ్నాయంగా బ్యాటరీ సహాయంతో ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొచ్చినా ఇందులో కూడా పర్యావరణానికి కొంత హాని కలిగించే లిథియం మూలకం ఉంటుంది. పొగ వెలువరించక పోయినప్పటికీ పరోక్షంగా ఇది పర్యావరణానికి ముప్పుగా చెప్పాలి. నానో ముసాయిక్ అబ్జర్వ్మెంట్ అనే నూతన ప్రయోగం ద్వారా నీటి నుంచి లిథియంను తీసే ప్రయోగాన్ని ఇటీవలే అమెరికాలో కనుగొన్నారు. దీనిద్వారా నీరు శుద్ది అవుతందట. అంటే ఇక్కడ మనం గమనించవల్సినది నీటిలో లిథియం ఉంటుంది. ఈ హైడ్రోజన్ వాహనాల్లో నేరుగా నీటినే వాడుతారు కనుక అందులోని లిథియం అనే మూలకం వాహన ప్రయాణానికి ఉపయోగపడి చివరగా బయటకు స్వచ్చమైన నీరు విడుదల అవుతుంది. తద్వారా పర్యావరణానికి ముప్పు లేకుండా చూడవచ్చు. వారెవ్వా ఏమి ప్రయోగమో కదా.

 

 

 

T.V.SRIKAR