Icon Star: బాలీవుడ్‌ను దున్నేస్తున్న బన్నీ.. సల్మాన్‌ ఖాన్‌ తరువాత అల్లు అర్జునే టాప్‌..

అల్లు అర్జున్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప ది రూల్‌ గ్లింప్స్‌ ఇంటర్నెట్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తోంది. రిలీజైన అన్ని భాషల్లో కలిపి ఇప్పటి వరకూ 80 మిలియన్స్‌కు పైగా వ్యూస్‌ వచ్చాయి. 3 మిలియన్స్‌కు పైగా లైక్స్‌ వచ్చాయి. ఇక్కడ హైలెట్‌ ఏంటంటే.. ఓన్లీ హిందీ వెర్షన్‌లోనే 20 మిలియన్‌కి పైగా వ్యూస్‌ వచ్చాయి. సినిమా ఒరిజినల్‌ వెర్షన్ తెలుగు అయినప్పటికీ తెలుగులో కూడా ఈ రేంజ్‌లో వ్యూస్‌ రాలేదు. అంతే కాదు.. పఠాన్‌ సినిమా తరువాత హిందీలో ఎక్కువ లైక్స్‌ వచ్చి గ్లింప్స్‌ పుష్ప మాత్రమే.

  • Written By:
  • Publish Date - April 13, 2023 / 08:40 PM IST

ఈ ఒక్కటి చాలు బాలీవుడ్‌లో బన్నీ క్రేజ్‌ ఏ రేంజ్‌లో ఉందో చెప్పడానికి. ఎర్రచెందనం స్మగ్లింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన పుష్ప సినిమా తెలుగుతో పాటు నార్త్‌ ఇండియాలో కూడా సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. అల్లు అర్జున్‌ మాస్‌ లుక్‌కు ప్రత్యేకంగా తగ్గేదే లే అనే డైలాగ్‌కు నార్త్‌ పీపుల్‌ ఫిదా అయిపోయారు. పాన్‌ ఇండియా సినిమాగా వచ్చిన పుష్ప రిలీజైన తరువాత పాన్‌ వరల్డ్‌గా మారిపోయింది. ఓవర్సీస్‌లో కూడా పుష్ప ఫస్ట్‌ పార్ట్‌కు ఓ రేంజ్‌లో కలెక్షన్లు వచ్చాయి.

దీంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో పుష్ప 2 విషయంలో మరింత జాగ్రత్తగా వర్క్‌ చేస్తున్నాడు సుకుమార్‌. వరల్డ్‌ సినిమా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అందుకే ఈ సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్‌ వచ్చినా క్షణాల్లోనే వైరల్‌గా మారిపోతోంది. గంగమ్మ తల్లి గెటప్‌లో రిలీజైన్‌ అల్లు అర్జున్‌ పోస్టర్‌ కూడా ఇప్పుటు ఇంటర్నెట్‌లో ట్రెండ్‌ అవుతుంది. గ్లింప్స్‌ రిలీజ్‌ చేసిన రోజే ఈ పోస్టర్‌ను కూడా రిలీజ్‌ చేశారు మూవీ టీం.

బన్నీ ఫ్యాన్స్‌కు బ్యాక్‌ టు బ్యాక్‌ సర్పైజ్‌ ఇచ్చారు. గ్లింప్స్‌కు ఏ రేంజ్‌లో రెస్పాన్స్‌ వచ్చిందో పోస్టర్‌కు కూడా అదే రేంజ్‌లో రెస్పాన్స్‌ వచ్చింది. స్టోరీ లైన్‌ను చెప్తూ రిలీజైన గ్లింప్స్‌ సినిమా మీద అమాంతం అంచనాలు పెంచేసింది. ఈ సినిమా కోసం బన్నీ ఫ్యాన్సే కాకుండా సినిమా అభిమానులంతా చాలా ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు.