జానీ మాస్టర్ కేసు విషయం విని షాక్ అయ్యాననన్నారు యానీ మాస్టర్. వారంపాటు ఏం తోచని స్థితిలో ఉన్నానని తెలిపారు. అన్నీ తెలుసుకున్న తర్వాతే మీడియా ముందు మాట్లాడదాం అని ఈరోజు ముందుకు వచ్చానని ఆమె పేర్కొన్నారు. జానీ మాస్టర్ కి వచ్చిన నేషనల్ అవార్డు కూడా వెనక్కి తీసుకోవడం బాధాకరమన్నారు. నేరం రుజువు కాకముందే అవార్డు కమిటీ తీసుకున్న నిర్ణయం సరైంది కాదు.. కనీసం హోల్డ్ లో పెట్టాల్సిందని ఆమె పేర్కొన్నారు. జానీ మాస్టర్ దగ్గర నేను రెండేళ్లు వర్క్ చేశాను. ఇతర దేశాలు కూడా వెళ్ళాము.. మంచి వ్యక్తి అని గుర్తు చేసుకున్నారు.
జానీ మాస్టర్ మంచివాడు.. గొప్ప వ్యక్తి అని మీడియా ముందు చెప్పిన అమ్మాయి.. కేసు పెట్టడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఎవరికైనా సమస్య అని తెలియగానే సహాయం చేసే వ్యక్తుల్లో జానీ ముందుంటారని ఆమె తెలిపారు. ఈరోజు అమ్మాయి విషయం అనే ఒక్క కారణంతో.. ఎవరూ స్పందించడం లేదన్నారు. నేను ఇప్పటివరకు ఎవరి నుంచీ ఎలాంటి వేధింపులు ఎదుర్కోలేదని ఆమె స్పష్టం చేసారు. అసలు వేధింపులు అనేవి ఉండవన్నారు. కొరియోగ్రఫీ అసోసియేషన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉందని వేధింపుల విషయాన్ని ఉపేక్షించదని స్పష్టం చేసారు.
ఇన్ని రోజులు వర్క్ చేసాక ఇప్పుడు ఎందుకు బయటకి వచ్చిందని ప్రశ్నించారు. ఒకవేళ ఎలాంటి రేప్ జరగలేదు అంటే అప్పుడు ఏంటి అని అడుగుతున్నాను అని ఆమె ప్రశ్నించారు. ఈ ఇష్యూ బయట వచ్చాక విక్టిమ్ నన్ను కమ్యూనికేట్ అవ్వడం కూడా జరిగిందని ఇన్ని రోజులు ఇద్దరు హ్యాపీ గా షోస్ లో ఉండడం కల్సి డాన్స్ చేయడం కూడా జరిగింది …. ఇప్పుడు ఇలా కేసు పెట్టి జైలు లో ఉంచడం బాధాకరమన్నారు. డాన్సర్స్ అయినా మేము ఎప్పుడు పని దొరుకుతాది అని చూస్తాం అంతే కానీ ఎలాంటి కార్యకలాపాలు గురించి ఆలోచించమన్నారు.