Kalki : బడ్జెట్ ఫుల్.. ప్రమోషన్స్ నిల్

సినిమా తీయడం ఒకెత్తయితే.. బాగా ప్రమోట్ చేసి దానిని జనాల్లోకి తీసుకెళ్లడం మరో ఎత్తు. ముఖ్యంగా భారీ బడ్జెట్ తో రూపొందే సినిమాలకు ప్రమోషన్స్ విపరీతంగా చేస్తారు.

 

 

సినిమా తీయడం ఒకెత్తయితే.. బాగా ప్రమోట్ చేసి దానిని జనాల్లోకి తీసుకెళ్లడం మరో ఎత్తు. ముఖ్యంగా భారీ బడ్జెట్ తో రూపొందే సినిమాలకు ప్రమోషన్స్ విపరీతంగా చేస్తారు. ప్రమోషన్స్ తో అంచనాలు భారీగా పెరిగేలా చేస్తే.. రికార్డు స్థాయి ఓపెనింగ్స్ వస్తాయి. దాంతో కొంచెం టాక్ అటూ ఇటూ అయినా పెద్దగా రిస్క్ ఉండదని మేకర్స్ భావిస్తుంటారు. కానీ ‘కల్కి విషయంలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోంది.

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ‘కల్కి’ . వైజయంతి మూవీస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ఇంకా వారం రోజుల సమయమే ఉంది. కానీ ప్రమోషన్స్ లో మాత్రం మూవీ టీం దూకుడు చూపించడంలేదు. ప్రభాస్ లాంటి స్టార్ హీరో సినిమా వస్తుందంటే తెలుగునాట ఉండే సందడే వేరు. ఆ సందడిని రెట్టింపు చేసేలా.. మాస్ ని అట్రాక్ట్ చేసేలా.. అగ్రెసివ్ ప్రమోషన్స్ ఉండాలి. కానీ ‘కల్కి’ టీం మాత్రం అందుకు భిన్నంగా అడుగులు వేస్తోంది.

ప్రమోషన్స్ లో దూకుడు చూపించడం లేదు. అయితే దీని వెనుక ఓ స్ట్రాటజీ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ సినిమా అంటే తెలుగునాట ఎలాగూ రికార్డు ఓపెనింగ్స్ వస్తాయి. అందుకే విడుదలకు ముందు మితిమిరీన అంచనాలు పెంచే కంటే.. థియేటర్లకు వచ్చిన ఆడియన్స్ ని తమ కంటెంట్ తో సర్ ప్రైజ్ చేయాలనేది మేకర్స్ స్ట్రాటజీ అని సమాచారం. ‘కల్కి’ సినిమా అవుట్ పుట్ పట్ల మేకర్స్ ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారట. ఇది ప్రభాస్ ఫ్యాన్స్ నో, లేక ఒక వర్గం ప్రేక్షకులనో టార్గెట్ చేసి తీసిన సినిమా కాదని.. అన్ని వర్గాలను అలరించే గొప్ప చిత్రమవుతుంది చాలా నమ్మకంగా ఉన్నారట. అందుకే, తుఫాను ముందు ప్రశాంతతలా.. కొత్త స్ట్రాటజీతో ముందుకు వెళ్తూ.. విడుదల తర్వాత సంచలనం సృష్టించాలని చూస్తున్నారట.